కృష్ణాజిల్లా పోలీస్
*వార్షిక తనిఖీల్లో భాగంగా బందర్ సబ్ డివిజన్లోని కృత్తివెన్ను, మచిలీపట్నం పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఏలూరు రేంజ్ ఐజిపి శ్రీ జివిజి అశోక్ కుమార్ ఐపిఎస్.*
వార్షిక తనిఖీల్లో భాగంగా ఈరోజు ఏలూరు రేంజ్ ఐ.జి.పి శ్రీ జి.వి.జి.అశోక్ కుమార్ ఐపీఎస్ గారు మచిలీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని కృత్తివెన్ను, మచిలీపట్నం పోలీస్ స్టేషన్లలో తనిఖీ నిర్వహించారు.
▪️ఈ వార్షిక తనిఖీల్లో ఐజిపి గారితో పాటు కృష్ణాజిల్లా ఎస్పీ శ్రీ ఆర్.గంగాధరరావు, ఐపీఎస్., గారు, బందరు డిఎస్పి సిహెచ్ రాజా గారు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
▪️ కృత్తివెన్ను పోలీస్ స్టేషన్ తనిఖీకి విచ్చేసిన ఐ.జి.పి గారికి పోలీసు అధికారులు మొక్కలు అందజేసి సాదర స్వాగతం పలకగా, సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు.
▪️మచిలీపట్నం పోలీస్ స్టేషన్ తనిఖీ చేయడానికి ముందు ఐ.జి.పి గారు, ఎస్పీ గారు, బందరు డిఎస్పి గారితో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో గల పింగళి వెంకయ్య గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.
▪️మొదటగా పోలీస్ స్టేషన్ల పరిసర ప్రాంతాలను పరిశీలించి స్టేషన్ చుట్టుపక్కల ఉన్న పరిసరాలను చూసి ఎల్లవేళలా పోలీస్ స్టేషన్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని , ఆహ్లాదకరమైన వాతావరణం స్టేషన్ లో ఉంటే సిబ్బందిలో పని ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు.
▪️పోలీస్ స్టేషన్ నిర్వహిస్తున్న ప్రతి రికార్డును క్షుణ్ణంగా పరిశీలించి రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంచుకోవాలని, ప్రతి అంశాన్ని రికార్డులలో నమోదు చేసుకోవడం తప్పనిసరి అని, రికార్డులు అప్డేట్ విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని తెలిపారు. రికార్డ్, పోలీస్ స్టేషన్ నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తపరిచారు.
▪️పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందితో ముఖాముఖి మాట్లాడి వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నది తెలుసుకున్నారు.
▪️వారి కుటుంబ నేపథ్యం, విద్యార్హతలు, పోలీస్ శాఖలోకి రావడానికి కారణం, వారి ఆశయాలను గూర్చి అడిగి తెలుసుకున్నారు.
*ఐ.జి.పి గారు మాట్లాడుతూ..*
▪️పోలీస్ స్టేషన్ కి వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారి సమస్యను సామరస్యంగా విని సమస్య పరిష్కారమయ్యేలా వారితో మెలగాలని తెలిపారు.
▪️పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని, గుడ్ ట్రైల్ మానిటరింగ్ ద్వారా కేసులలో శిక్షణ శాతం పెంచాలని సూచించారు.
▪️పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాల కేసులలో ప్రాపర్టీ రికవరీ శాతం పెంచాలని, అనుమానాస్పద వ్యక్తుల యొక్క ఫింగర్ ప్రింట్ సేకరించి వారి గత నేరచరిత్ర గూర్చి వాకబు చేయాలి. పాత, కొత్త నేరస్థులపై నిరంతర నిఘా ఉండాలని తెలిపారు.
మత ఘర్షణలకు ఆస్కారం లేకుండా, మతసామరస్యానికి విఘాతం వాటిల్లకుండా ప్రత్యేక చర్యలు చేపడుతూ ప్రశాంత వాతావరణంలో కార్యక్రమాలు జరిగేలా చూడాలి. ప్రతి గ్రామ పరిధిలో పల్లెనిద్రలు చేస్తూ సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకుని గొడవలకు ఆస్కారం లేకుండా చూడాలని తెలిపారు.
▪️మహిళలు, చిన్న పిల్లలపై జరిగే నేరాలను కట్టడి చేయడానికి ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో *శక్తి ఆప్* గురించి , వారి కి గల రక్షణ చట్టాల గురించి శక్తి టీం బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీసువారి సహాయాన్ని పొందేలా వారిలో ధైర్యాన్ని నింపాలన్నారు.
▪️మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి తక్షణమే వారికి న్యాయమందించే దిశగా కృషి చేయాలన్నారు.
▪️నేరం జరిగేందుకు అవకాశం ఉన్న ప్రతి ప్రదేశాలలో, వాణిజ్య సముదాయాలు, నిర్మానుష ప్రదేశాలలో సీసీ కెమెరాలు అమర్చేలా చూడాలని తెలిపారు.
▪️ఆర్థిక నేరాల కట్టడికి LHMS వినియోగం, సీసీ కెమెరాలు అమర్చుకోవడం వంటిది చేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలి. మరి ముఖ్యంగా సైబర్ నేరాల నియంత్రణకి సామాజిక మధ్యమాల వినియోగం, ఓటీపీ ఫ్రాడ్స్, బ్యాంక్ మోసాల గూర్చి ప్రజలలో చైతన్య తీసుకురావాలి.
▪️బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై కొరడా జులిపిస్తూ నిరంతర పర్యవేక్షణ చేస్తూ, మద్యం సేవించే వారిపై కేసులో నమోదు చేయాలని తెలియజేశారు.
▪️పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాలలో నాటుసార తయారీ ఆనవాళ్లు లేకుండా చూడాలని, గతంలో నాటు సారా తయారీదారులను పిలిచి వారితో మాట్లాడి నాటు సారా తయారీ, వినియోగం, విక్రయాలు వంటివి లేకుండా చూడాలని తెలిపారు.
▪️డ్రోన్ కెమెరాల వినియోగం మరింత పెంచుతూ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆనవాయితీగా జరిగే జాతరలు, ఉత్సవాలను పర్యవేక్షణ చేస్తూ, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు, అవాంఛనీయ శక్తుల ఆగడాలకు అవకాశం లేకుండా పటిష్ట నిఘాని ఏర్పాటు చేయాలి.
▪️నేటి కాలంలో ఎక్కువగా జరుగుతున్న రహదారి ప్రమాదాలలో ద్విచక్ర వాహనం వినియోగించే వారే అధికం హెల్మెట్ ధరించకపోవడం వలన చాలామంది మృత్యువాత పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
▪️ముఖ్యమైన కూడళ్ళు, జనసంచారం అధికంగా ఉండే ప్రదేశాలలో డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేయిస్తూ, ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
▪️రహదారి ప్రమాదాలను నివారించేందుకు భద్రతా ప్రమాణాలు ప్రతి ఒక్కరు పాటించేలా చూడాలని, ప్రమాదాలు అధికంగా జరిగే ప్రదేశాలను బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి ఆ ప్రదేశాలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం, రేడియం స్టిక్కర్స్ తో కూడిన ప్లాస్టిక్ డ్రమ్ములు, బార్గేట్స్ ఏర్పాటు చేయడం వంటివి చేసి ప్రమాదాలను నివారించాలి.
▪️సిబ్బందికి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ పై శిక్షణ తరగతులు నిర్వహిస్తూ, పదవీ విరమణ చేసిన పోలీస్ ఆఫీసర్స్ తో ముఖ్యమైన సూచనలు చేయించేలా చర్యలు చేపట్టాలన్నారు.
▪️ట్రాఫిక్ నియమ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించేలా ప్రత్యేక చొరవ చూపిస్తూ, వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చర్యలు చేపట్టాలి. అవసరం మేరకు జరిమానాలు విధిస్తూ హెల్మెట్ యొక్క ప్రాధాన్యాన్ని తెలియజేయాలన్నారు.
▪️పోలీస్ శాఖలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం అనేది ఒక యజ్ఞం వంటిదని అనుకూల, ప్రతికూల పరిస్థితులను అర్థం చేసుకుంటూ, సమయస్ఫూర్తిగా వ్యవహరించాలని తెలిపారు.
▪️విధులు నిబద్ధతగా నిర్వర్తించాలంటే ఆరోగ్యమనేది ముఖ్యమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెడుతూ, రోజువారి దినచర్యలో వ్యాయామం ఒక అలవాటుగా చేసుకోవాలని, తద్వారా భవిష్యత్తులో వచ్చే అనేక అనారోగ్య సమస్యలను దూరంగా ఉంచగలమని తెలిపారు.