తేదీ 21/4/2025..
ప్రచురణ // ప్రసారార్థం
ఫీజుల నియంత్రణ క్ చర్యల కు కలెక్టర్ ఆదేశాలు...
-ప్రవైట్ పాఠశాల లలో ఫీజుల నియంత్రణ కు DFRC సమావేశమై 2025-26 విద్యా సంవత్సరం ఫీజుల నిర్ధారణ చేయాలి
-ప్రతి పాఠశాల అకౌంట్ ఆడిట్ మరియు సొసైటీ ట్రస్ట్ ల ఆడిట్ లను ఆర్డీవో స్థాయి జుడిషియల్ అధికారుల ద్వారా చేయించాలి.
-ఫీజుల వివరాలను పాఠశాల నోటీసు బోర్డుపై విద్యాశాఖ పాఠశాల వెబ్ సైట్ లో ఉంచాలి.
-డి ఎఫ్ ఆర్ సి సమావేశం అనంతరం పాఠశాలల ఫీజుల వివరాలను మీడియా ముఖంగా ప్రకటించాలి
-పాఠశాల ఫీజు రసీదులలో విద్యాశాఖ రిజిస్ట్రేషన్ నెంబర్ సొసైటీ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాఠశాల కల్పించే సేవల బట్టి ఫీజుల వివరాలను ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ రోజు సోమవారం జరిగిన గ్రీవెన్స్ లోకలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది... వెంటనే స్పందించిన కలెక్టర్ గారు జిల్లా విద్యాశాఖ అధికారికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శిఖరం నరహరి నెల్లూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోటా శ్రీనివాసులు రెడ్డి ఉడుతా రాజశేఖర్ మరియు విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు
అనంతరం జిల్లా వినియోగదారుల కమిషన్ జడ్జి గారిని కలిసి విచారణ జరపాలని కోరుతూ ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్, విద్యార్థి తల్లిదండ్రులు అర్జీ ఇవ్వడం జరిగింది
1) ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం, 1982 మరియు దాని నియమాలు (1993), పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ (సవరణ) చట్టం, 2019,
విద్యా హక్కు చట్టం 2009 వినియోగదారుల రక్షణ చట్టం, 2019 ప్రకారం, పాఠశాలలు సరైన ఖాతాలను నిర్వహించాలి మరియు అన్ని ఫీజు చెల్లింపులకు అన్ని వివరాల తో రసీదులు జారీ చేయాలి. రసీదులు చెల్లింపుకు రుజువుగా పనిచేస్తాయి ఆధిక ఫీజుల చెల్లింపు వివాదాలకు పరిష్కారానికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము
2)ఆంధ్రప్రదేశ్ విద్యా చట్టం, 1982 మరియు దాని నియమాలు 1993, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం
జిల్లా లోని ప్రవైట్ పాఠశాల ఫీజు నిర్మాణాలను జిల్లా ఫీజు నియంత్రణ కమిషన్ (DFRC) ఆమోదించాలి మరియు రసీదులు ఆమోదించబడిన మొత్తాలతో సరిపోలాలి.
2025-26 విద్యా సంవత్సరం సంబంధించి జిల్లా లోని ప్రవైట్ పాఠశాల ఫీజుల నిర్ధారణ ను విద్యార్థి తల్లిదండ్రుల కు పాఠశాల విద్యాశాఖ వైబ్ సైట్ లో మరియు పాఠశాలాల నోటీసు బోర్డుపై ఉంచాలి .ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా బహిరంగ పరచాలని కొరుతున్నాము.
3) జిల్లా లోని ప్రతి ప్రవైట్ పాఠశాల ఖాతాలను,సోసైటీ/ ట్రస్టు ఖాతాలను ఉన్నతస్థాయి జ్యూడిషల్ అధికారుల ద్వారా ఆడిట్ చేయాలని కోరుచున్నాము
4) ఆంధ్రప్రదేశ్ ఫీజు నియంత్రణ విధానాలు DFRC, స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కమిషన్ ద్వారా ప్రవైట్ పాఠశాల లలో ఫీజు వివాదాలను పరిష్కరించడానికి ప్రభుత్వం వెంటనే స్పందించి ఉత్తర్వులు అమలు విన్నవించుకుంటున్నాము
అభివందనములతో
ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
(రిజిస్టర్ నెంబర్ 6/2022)
ఆంధ్రప్రదేశ్ కమిటీ
మలి రెడ్డి కోటా రెడ్డి.( అడ్వకేట్ )రాష్ట్ర గౌరవాధ్యక్షులు
నరహరి.శిఖరం రాష్ట్ర అధ్యక్షులు
జీ.ఈశ్వరయ్య రాష్ట్ర కార్యదర్శి
శ్రీనివాస్ రెడ్డి ,కోట. జిల్లా అధ్యక్షులు
వి .రాజశేఖర్ రావు. జిల్లా కార్యదర్శి