పహల్గం ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని

*పహల్గం ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ విజయవాడ లోని కృష్ణ మిల్క్ యూనియన్ (విజయ) మిల్క్ ఫ్యాక్టరీలో మానవహారం 













*ఈ మానవహారంలో పాల్గొని ఉగ్రవాదులు దాడిని ఖండించిన ఎంపీ కేశినేని శివనాథ్ 


*కృష్ణ మిల్క్ యూనియన్ (విజయ) చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటు


*పహల్గం ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఈ దాడి పాకిస్తాన్ ఆధ్వర్యంలోనే జరిగిందన్న ఎంపీ కేశినేని శివనాథ్ 


*ఉగ్రవాదులు దాడుల్లో గాయపడిన వారికి సానుభూతి తెలియజేయడంతోపాటు మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించిన ఎంపీ కేశినేని శివనాథ్


*ఇలాంటి అమానుషమైన దాడులకు పాల్పడిన వారిని ప్రేరేపించిన వారిని కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుంది


* దేశ ప్రజలందరూ ఐక్యమత్యంగా ఒకటై  ఉంటున్న సమయంలో విభేదాలు సృష్టించటానికి ఉగ్రవాదమూకలు ఈ దాడికి పాల్పడ్డారు 


* దేశ ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న అరాచక శక్తుల్ని కఠినంగా శిక్షించాలని దేశ ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుకుంటున్నారు 


* దేశాభివృద్ధిని చూసి ఓర్వలేక  పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉగ్రవాదులు ఈ ఉన్మాద చర్యకు పాల్పడ్డారు

* ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి పతావుల్లా, రాష్ట్ర తెలుగు మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు ఆషా, రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ (అన్న), మేనేజింగ్ డైరెక్టర్ ఈశ్వర్ బాబు