No title

 జూనియర్‌ కళాశాలల ఎంపిక ఎలా?

పదవ తరగతి పరీక్ష ఫలితాలు రాకముందే... ప్రైవేటు విద్యా వ్యాపారుల సౌలభ్యం కోసం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ప్రారంభించింది...

(తీసుకునేది ప్రభుత్వ జీతాలు... పాటు పాడేది విద్యా వ్యాపారుల కోసం)

 సరే...



రెండు రోజుల్లో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి..


-జూనియర్‌ కళాశాలలను గుర్తించాలంటే ఎటువంటి ప్రామాణిక కొలమానాలు లేవు. ఉన్న అమలు చేయని అధికారులు ఎందుకు లేవని అడగని తలిదండ్రులు 

-ఈ కళాశాల  పరిధిలోని వసతి గృహాలపై వివిధ ప్రభుత్వ శాఖల ఇంటర్మీడియట్ బోర్డ్ పర్యవేక్షణ అసలే లేదు.

 -జేఈఈ, నీట్, ఎంసెట్‌ పేరు చెప్పి ఎంత ఫీజు వసూలు చేస్తున్నా నియంత్రించే యంత్రాంగమూ  లేదు. 

- జేఈఈ, నీట్, ఎంసెట్‌ పేరు తో కళాశాల సమయం లో కోచింగ్ సెంటర్లు గా కళాశాల లను నడుపుతున్న ఏ అధికారులు ఏ తలిదండ్రులు ప్రశ్నించరు. 

- కళాశాలలో చేరిన వెంటనే బండి నిండా మెటీరియల్ ఇస్తే చాలు తల్లిదండ్రులకు ఆనందం.... 

-  పిల్లవాడు రెండు సంవత్సరాల అయ్యే లోపు  పుస్తకం సీలు గాని మడత గాని నలగదు విప్పరు... మిఠాయి కి వేయాల్సిందే.. కళాశాలలో బోర్డు అనుమతి పాఠ్యపుస్తకాల బోధన ఉండదు అడిగే నాథుడే ఉండరు 

-  అందుకే తమ పిల్లల్ని ఏ కళాశాలలో చేర్పించాలనే అయోమయం తల్లిదండ్రులను వెంటాడుతుంటుంది. 

-  ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త గా కొన్ని అంశాలను తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా  ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలున్నాయి. రాష్ట్రంలో ఏటా ఇంటర్‌లో సుమారు 4.80 లక్షల మందికిపైగా చేరుతుండగా..అందులో కేవలం ప్రైవేటు కళాశాలల్లోనే దాదాపు 3 లక్షల మంది ప్రవేశాలు పొందుతున్నారు. ఇదో వేలం వెర్రి..

- ప్రైవేటు కళాశాలలు గృహ, వాణిజ్య సముదాయాల్లో నడుస్తున్నందున.. గాలి వెలుతురు మరుగుదొడ్లు చివరికి మంచినీళ్లు కూడా ఉండవు. 

-ఇంటర్ బోర్డు 4 గ్రూపులు నడపాలంటే చివరికి ఆ కళాశాల బోర్డుపై ఉన్న గ్రూపులు నడపరు వారి వ్యాపార సౌలభ్యం కోసం ఒకే ఒక గ్రూపు నడుపుతారు... ఇదేందని అడిగేవాడే లేడు..

-ఇంకో మాట రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు ఉండదు ఎందుకు లేవని ప్రశ్నించే వారే లేరు..

పోతే ఆటలు ఉండవు పాటలు ఉండవు..


ఏమి లేకపోయినా మనకు ఆనందం మార్కులు...

డబ్బులు పెడుతున్నాము మావాడు ఫలానా ప్రవేట్ కళాశాలలో చదువుతున్నాడు అంటే గొప్ప..

వాడి మానసిక శారీరిక పరిస్థితి గురించి ఆలోచించం...

ఎందుకంటే మార్కులే మనకు ముఖ్యం...

-సరి కదా దేశం మొత్తం ఐఐటీలో త్రిబుల్ ఐటీలు ఎన్ఐటీలలో సీట్ల సంఖ్య 50,000 .. 


-ఈ వ్యాపారులు కళాశాల చేరే సమయంలో చెప్పే మాటలకి చేతలకి మీడియాలో వీరి అడ్వర్టైజ్మెంట్ కి పొంతనలు ఉండవు... అయినా నమ్ముతాం..


@ కొన్ని అయినా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది...


- ప్రవేశాలు పొందే ముందు ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్ అఫిలియేటెడ్‌ కాలేజెస్‌’ అనే చోట క్లిక్‌ చేస్తే అనుమతులు ఉన్న కళాశాలల జాబితా ఉంటుందని, వాటికి మాత్రమే బోర్డు అనుమతి ఉన్నట్లు భావించాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘ఆ వెబ్‌సైట్‌ను చూస్తే మీ పిల్లలు చేరిన కళాశాలకు అనుమతి ఉందో లేదో తెలిసిపోతుంది. 

-పిల్లల అభిరుచులు, శక్తిసామర్థ్యాలను పరిగణనలోకి తీసుకొని కళాశాలను, గ్రూపును ఎంపిక చేసుకోవడం అత్యంత ముఖ్యం. 

-పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడి తమ కుమారుడు/కుమార్తె ఏ గ్రూపులో రాణిస్తారో తెలుసుకుంటే మరీ మంచిదని’ విద్యావేత్తలు సూచిస్తున్నారు.

-ఇళ్ల దగ్గరకు వచ్చే పీఆర్వోలు చెప్పే మాయమాటలు నమ్మకూడదు. వారు మొదటి సంవత్సరానికి మాత్రమే ఫీజు చెబుతారు. ఒకసారి ప్రవేశం పొందిన తర్వాత విద్యార్థి ఎటూ వెళ్లలేడనే భావనతో అనేక కళాశాలలు రెండో ఏడాది ఫీజును భారీగా పెంచుతున్నాయి. అందుకే ద్వితీయ సంవత్సరం ఫీజునూ ముందే రాతపూర్వకంగా నిర్ధారించుకోవడం ఉత్తమం.

-ఆయా సబ్జెక్టులు బోధించే అధ్యాపకులు ఎవరు, వారి విద్యార్హతలు, అనుభవం తదితరాలు తెలుసుకుంటే విద్యార్థి భవిష్యత్తు బాగుంటుంది.

-మా వాడికి  మార్కులే చాలు లే అనుకుంటే విద్యార్థి ఎవరికీ పనికిరాకుండా పోతాడు

-హాస్టళ్లలో నలుగురు ఉండాల్సిన గదిలో ఆరేడు మందిని ఉంచుతున్న ఉదంతాలెన్నో. కాబట్టి హాస్టళ్లలో చేర్పించే పక్షంలో ఒక్కో గదిలో ఎంత మందిని ఉంచుతారో ముందే తెలుసుకోవడంతోపాటు ఆ మేరకు సౌకర్యాలు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి.

-రెసిడెన్షియల్‌ కళాశాలల్లో చేరే ఎక్కువ మంది విద్యార్థుల ఫిర్యాదు భోజనంపైనే ఉంటుంది. ఈ నేపథ్యంలో హాస్టల్‌ మెనూ తెలుసుకోవడం ఉత్తమం.

-రేపు ఏదైనా ప్రమాదం జరిగితే ఏడ్చి లాభం లేదు ముందుగా ఆ హాస్టలకు ప్రభుత్వ శాఖల అనుమతులు ఉన్నాయా లేవా పరిశీలించడం ఉత్తమం..


@ ఐదంకెల నంబరు బోర్డుపైన ఉందా? బోర్డు అనుమతులు ఉన్నాయా...?

కొన్ని కళాశాలలకు ఇంటర్‌బోర్డు అనుమతులు ఉండవు. కొన్ని యాజమాన్యాలు ఒక దానికి అనుమతి తీసుకుని.. రెండు మూడు చోట్ల బ్రాంచీలు నడుపుతాయి.

- ఉదాహరణకు -  కళాశాలలో చేర్చే సమయంలో దగ్గరలో చుట్టుపక్కల పరీక్ష కేంద్రాలు ఉంటాయని తల్లిదండ్రులు భావిస్తారు. 

వాస్తవంగా దానికి వేరే ప్రాంతంలో అనుమతి ఉండటంతో పరీక్ష కేంద్రం దూరంగా ఉంటుంది. అందువల్ల చేర్పించే ముందే కళాశాలకు ఇంటర్‌బోర్డు అనుమతులు జారీ చేసిన ‘ఐదు అంకెల కళాశాల కోడ్‌’ ఉందా అనేది ఆరా తీయాలి. సాధారణంగా ఆ నంబరును కళాశాల బోర్డుపైనే రాస్తారు. అలా రాయని పక్షంలో ఆ భవనంలో నడిచే కళాశాలకు అనుమతి లేనట్లేనని భావించాలి.

అనుమతి పత్రాలు చూపించమని అడగాలి.


మారమని ....మార్చమని...  తల్లిదండ్రులను కోరుతూ..


                 అభివందనములతో

ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 

          (రిజిస్టర్ నెంబర్ 6/2022)

                 ఆంధ్రప్రదేశ్ కమిటీ