కిల్తంపాలెం పంచాయతీ పరిధిలో. కొబ్బరి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

 విజయనగరం జిల్లా.

ఎస్ కోట మండలం.

కిల్తంపాలెం పంచాయతీ పరిధిలో.

కొబ్బరి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.









 చనిపోయిన కొబ్బరి మొక్కల స్తానంలో కొత్త మొక్కలు నాటుటకు మరియు వాటిని పునరుద్దరణ చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రీప్లాంటింగ్ అండ్ రెజ్యూవినేషన్ ఆఫ్ కోకోనట్ గార్డెన్ స్కీంతో మన జిల్లా కొబ్బరి రైతులను కూడా ఆదుకొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లోక్ సత్తా పార్టీ జిల్లా కార్యదర్శి కాండ్రేగుల ప్రసాద్ అన్నారు.  కిల్తంపాలెం పంచాయతీ పరిధిలో గల కొబ్బరి రైతులతో.కూలీలు  కొరత వల్ల వ్యవసాయాన్ని సకాలంలో చెయ్యలేక ఉద్యాన పంటలు వైపు మళ్ళి, కొబ్బరి సాగు చేస్తుంటే మొవ్వు కోరికే పురుగుల వలన మరియు  బూడిదరంగు తెగుళ్లు వలన  కాపుకొచ్చే మొక్కలు చనిపోతున్నాయని, దానివలన రైతులు నష్టపోతున్నారని అన్నారు.  కావున రైతులకు నష్టపరిహారంతో పాటు చనిపోయిన ముక్కలను తిరిగి నాటుకోనటం కోసం మొక్కకు వెయ్య రూపాయిలు చొప్పున తక్షణ పరిష్కారం గా అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో  కొబ్బరి రైతులు కే రాము, బీసెట్టి స్వామి నాయుడు, కే రామ వెంకట సత్యనారాయణ, ఎల్లపు స్వరూప్, కే. సైతం నాయుడు పాల్గొన్నారు. .