పల్లెకు పోదాం కార్యక్రమం కేంద్ర మరియు రాష్ట్ర పార్టీ ల అదేసాల మేరకు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు యస్. వి.రమణగౌడ్
ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం కు ముఖ్య అథిదిగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద గజపతి రాజు పాల్గొన్నారు. వీరు చుండుపల్లె మండలం లో ప్రభుత్వ ఆసుపత్రి ను, అలాగే అంగన్‌వాడీ కేంద్రాన్ని, MPP స్కూల్ ను, అలాగే కొందరు లబ్ధిదారులు ను అలాగే సచివాలయం సందర్శించి స్వచ్చభారత్ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధాన కార్యదర్శి ఆనంద గజపతి రాజు మాట్లాడుతూ. గ్రామీణ మండల ప్రాంతాలలో విధ్యా ప్రమాణాలు మెరుగు పరచడానికి నాణ్యమైన ప్రభుత్వ విధ్యా అందించడానికి సమగ్ర శిక్షా అభియాన్ లో భాగంగా మద్యాహ్నం బోజన పధకం, విద్యా అవసరాల కల్పన చిన్న పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రం గా పౌషిక ఆహారాలు పంపిణీ లాంటి ఎన్నో కార్యక్రమం లు మోడిగారి సారధ్యం లో కేంద్రప్రభుత్వం కల్పిస్తుంది. చుండుపల్లె ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించారు అలాగే బి జి రాచపల్లి ప్రభుత్వ ఆసుపత్రి, ఆయుష్మాన్ భారత్ కార్డు లు పంపిణీ పై అధికారులు ను అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే సచివాలయం నందు రైతు భరోసా కేంద్రం నందు, కిసాన్ క్రెడిట్ కార్డు మరియు బూసార పరిక్షలు కిసాన్ సన్మాన నిధులు అర్హులు ఐన అందరు రైతులకు అందేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమం కు, సీనియర్ నాయకులు రెడ్డయ్యాచారి అలాగే ఉపాధ్యక్షులు సుధాకరా, సీనయ్యసెట్టి.
వెంకట్రామ రాజు, రాజేంద్ర రాజు, రెడ్డయ్య రాజు తదితరులు పాల్గొన్నారు.
అలాగే రాయవరం నందు పల్లెకు పోదాం కార్యక్రమం రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సుబ్బరాజు గారి ఆద్వర్యంలో జరిగింది. వారు రాయవరం ప్రభుత్వ ఆసుపత్రి, రాయవరం అంగన్‌వాడీ కేంద్రం, స్కూల్ అలాగే సచివాలయం సందర్శించి అక్కడ వారి తో గ్రామంలో ఉన్న సమస్యలు త్వరితంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించడం జరిగింది.
అలాగే ఈ రోజు చుండుపల్లె మండల కేంద్రము లో జ్యోతి రావుపూలే జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం కు రాజంపేట అసెంబ్లీ కన్వీనర్ రామజగదీష్ స్వామి పాల్గొన్నారు.
ఇట్లు
యస్. వి.రమణ గౌడ్
బిజెపి చుండుపల్లె మండల అధ్యక్షుడు