బుది సంతాని జాతర – భక్తిశ్రద్ధలతో ప్రజా సంబరాలు
ఒడిషాలోని బెరంపూర్ పట్టణంలో బుది సంతాని అమ్మవారి జాతర ఉత్సాహభరితంగా, భక్తిశ్రద్ధలతో సాగింది. అమ్మవారిని ప్రసన్నం చేసేందుకు భక్తులు వివిధ వేషాలలో పాల్గొంటూ ఆహ్లాదకరమైన దృశ్యాలను సృష్టించారు.
అమ్మవారికి పులి నృత్యం ప్రీతికరమైనదని భావించి, ఖలాసీ వీధికి చెందిన యువకులు ఈ నెల 18న ప్రత్యేకంగా పులి నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ నృత్యంలో న్యూస్ 9 రిపోర్టర్ భారతి కుమారుడు భాగస్వామిగా ఉండటం విశేషం.
ఈ సందర్భంగా వారు బీజేపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ నివాసానికి వెళ్లి ఆశీస్సులు పొందారు. ప్రజాసేవకు అంకితమైన నేతగా ఎమ్మెల్యే అనిల్ కుమార్, బాల నర్తకుడికి స్ఫూర్తినిచ్చే మాటలతో మద్ధతు తెలిపారు.
అలాగే, న్యూస్ 9 ఏపీ లీగల్ అడ్వైజర్ జయలక్ష్మి కుమార్తె అఖిల కూడా ఈ జాతరలో చురుకుగా పాల్గొని సందడి చేసింది.
ఈ విధంగా, స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బుది సంతాని జాతర, భక్తి-భావాలతో ప్రజలను ఆకట్టుకుంది.