డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు...

 *జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు...* 




 చిలకలూరిపేటన్యూస్9. పట్టణం లోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యాలయంలో  చొప్పా  వీరనారాయణ అధ్యక్షతన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం పల్నాడు  జిల్లా యువజన అధ్యక్షులు  మాదాసు పృద్విరాజ్ సాయి హాజరై ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగం రాసి ఉండకపోతే మనకు రాజకీయంగా, విద్య, ఉద్యోగం, పరంగా, మనకు ఈ మాత్రం కూడా ఉండి ఉండేది కాదు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వి సీ కే పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంజా ముత్తయ్య , శ్యామ్, మనోహర్ , దేవరకొండ నాగేశ్వరరావు , జాతీయ బీసీ  సంక్షేమ సంఘం నాయకులు నాగేశ్వరరావు , రాచపూడి వెంకటరత్నం, తుర్లపాటి నగేష్ , నక్కా వెంకటేష్, నాగ తేజ, మాదాసు సాయి తేజ తదితరులు పాల్గొన్నారు...