*పహల్గామ్ ఉగ్రదాడి పిరికి చర్య...*
*ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి...*
విశాలాంధ్ర సుండుపల్లె మండల కేంద్రంలో జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు మంగళవారం ఉగ్రవాదులు దాడిలో అమాయకులైన ప్రజలు మృతి చెందిన దానిపై కూటమి నాయకులు బుధవారం కొవ్వూర్తులతో ర్యాలీ మానవహారం నిర్వహించారు. మారణ హోమం ప్రతీ ఒక్కరి హృదయాన్ని కదిలిస్తోందని ముఖ్యంగా మృతులు, బాధితులను చేసిన ఘటన దేశవ్యాప్తంగా ఉన్న గుండెలన్నీ శోకిస్తున్నాయి.కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి కలగాలని వారు మౌనం పాటించారు.క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని వారు భగవంతుణ్ణి ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో రాజంపేట భాజపా అసెంబ్లీ కన్వీనర్ రామ జగదీష్, సయ్యద్ అహ్మద్, స్వామి.జనసేన నాయకులు రెడ్డిరాణి. రాజా. జగిలి ఓబులేసు. రెడ్డయ్య రాజు. బిజెపి మండల అధ్యక్షుడు రమణ గౌడ్.నాగరాజు, సుబ్బరాజు,సుబ్బరాము అంజి. ప్రసాద్. నాగేశ్వర. సురేష్.తదితరులు పాల్గొన్నారు.