గ్రానైట్ క్వారీలలో జరిగిన గ్రానైట్ లీజులలో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాలని

 పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలోని సర్వే నెంబర్ 324/P లో గల సూర్య తేజ ఎక్స్పోర్ట్స్, సిహెచ్ చెంచుకుమారి గ్రానైట్ క్వారీలలో జరిగిన గ్రానైట్ 






లీజులలో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ సోమవారం నరసరావుపేటలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు, పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ జెవి సంతోషులకు చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన నార్నే హనుమంతరావు, చింతల సింగయ్య , బొప్పూడి గ్రామ ప్రజలు అర్జీని ఇవ్వడం జరిగినది.

ఈ సందర్భంగా ఫిర్యాదుదారులు మాట్లాడుతూ తాము పేర్కొన్న గ్రానైట్ క్వారీలలో జరిగిన అక్రమాలపై సంబంధిత ప్రభుత్వ శాఖలు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని వారు కోరారు. గత కొంతకాలంగా ఇదే విషయమై పలుమార్లు సంబంధిత అధికారులకు సమస్యను తెలియజేయడం జరిగిందని వారన్నారు. అయినప్పటికీ అధికారులు సమస్యను పరిష్కరించలేదని వారు తెలిపారు. మొదటగా నరసరావుపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు అర్జీలు అందజేసి అనంతరం పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీని కలిసి సమస్యలతో కూడిన అర్జీని అందజేయడం జరిగిందని తెలిపారు. అర్జీనిన తీసుకున్న జిల్లా అధికారులు సమస్యను త్వరలో పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఫిర్యాదు కార్యక్రమంలో బొప్పూడి గ్రామానికి చెందిన ప్రజలు, క్వారీల లీజు విషయంలో ఆర్థికంగా నష్టపోయిన బాధితులు తదితరులు ఉన్నారు.