రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని ఘనంగా

 విజయనగరం జిల్లా, శృంగవరపుకోట నియోజకవర్గం నుంచి వార్తలు...






నవ్య ఆంధ్రప్రదేశ్‌కి రథసారధి, నిత్య కృషివంతుడు, నిరంతర శ్రామికుడు, అమరావతి రూపకర్త, తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు.


టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి గొంప కృష్ణ ఆధ్వర్యంలో, శృంగవరపుకోటలోని పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు.


ఈ సందర్భంగా గొంప కృష్ణ మాట్లాడుతూ – “నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకులు. ఆయన ఆశయాలను నెరవేర్చడమే మన బాధ్యత” అని పేర్కొన్నారు.


వేడుకల అనంతరం, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఆపిల్ పళ్లను పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


"శృంగవరపుకోట నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని అర్ధవంతంగా జరుపుకుంటూ సేవా కార్యక్రమాలు చేపట్టిన గొంప కృష్ణ గారికి అభినందనలు. ...సన్యాసిరావు News9