భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని వినియోగ హక్కుల పరిరక్షణ ఫోరం పల్నాడు జిల్లా నాయకులు నరసరావుపేట సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశంలోకెల్లా అత్యుత్తమమైన విధంగా తీర్చిదిద్దారని, ఆయన భారత దేశ అభివృద్ధికి ఎల్లలేని కృషి చేశారన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు అయినప్పుడు మాత్రమే ఆ రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కుతాయని ఎన్నోసార్లు అన్నారు. చట్టబద్ధమైన పరిపాలన కోసం ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేసిన రోజు మాత్రమే భారత రాజ్యాంగం అమలు ఆ ఫలాలను అందరూ అనుభవించగలుగుతామని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వినియోగదారులకు పరిరక్షణ ఫోరం ప్రధాన కార్యదర్శి రవి నాయక్, కోశాధికారి బేబీ విక్రమ్ తదితరు నాయకులు పాల్గొన్నారు.