విజయవాడ
12-04-2025
ప్రచురణార్ధం
విజయవాడ పశ్చిమ వైసిపి కార్యాలయంలో మాజీ మంత్రి వెలంపల్లి అధ్యక్షతన కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జ్ లు, క్లస్టర్ల పార్టీ అధ్యక్షులు ఆత్మీయ సమావేశం
సమావేశంలో పాల్గొన్న నగర మేయర్, పశ్చిమ వైసిపి కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జ్ లు, వివిధ క్లస్టర్ల పార్టీ అధ్యక్షులు
*డివిజన్ స్థాయి నుంచి పార్టీ పదవుల నియామకాలు చేపట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి - మాజీ మంత్రి వెలంపల్లి*
*జగన్ మోహాన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి వైయస్ ఆర్ సిపి జెండా ఎగరవేయాలి - మాజీ మంత్రి వెలంపల్లి*
*మానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసిన ఏకైక వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి - మాజీ మంత్రి వెలంపల్లి*
*దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు హామీలను అమలు చేయలేమని ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు - మాజీ మంత్రి వెలంపల్లి*
*బూటకపు హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి - మాజీ మంత్రి వెలంపల్లి*
*వైసిపి హయంలో నియోజకవర్గంలోని 22 డివిజన్ లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి - మాజీ మంత్రి వెలంపల్లి*
*నియోజకవర్గంలోని ప్రతి గడపకు వివిధ సంక్షేమ పధకాల ద్వారా ప్రజలకు లబ్ది చేకూర్చాము - మాజీ మంత్రి వెలంపల్లి*
*పది నెలల కాలం లోనే కూటమి ప్రభుత్వం పై తీవ్ర అసంతృప్తితో ప్రజలు ఉన్నారు - మాజీ మంత్రి వెలంపల్లి*
*రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిపోయింది, లా అండ్ ఆడార్ గాడి తప్పింది, మహిళలకు రక్షణ లేదు - మాజీ మంత్రి వెలంపల్లి*
*వాలంటీర్, సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టి గడప వద్దకే పాలన అందించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి - మాజీ మంత్రి వెలంపల్లి*
స్థానిక బ్రాహ్మణ వీధిలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసిపి కార్యాలయం నందు శనివారం నాడు మాజీ మంత్రివర్యులు, - మాజీ మంత్రి వెలంపల్లి*విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన పశ్చిమ కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జ్ లు, క్లస్టర్ల పార్టీ అధ్యక్షుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ డివిజన్ స్థాయి నుంచి పార్టీ పదవుల నియామకాలు చేపట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జగన్ మోహాన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి వైయస్ ఆర్ సిపి జెండా ఎగరవేయాలని ఆదేశించారు. వైసిపి హయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్ లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, నియోజకవర్గంలోని ప్రతి గడపకు వివిధ సంక్షేమ పధకాల ద్వారా ప్రజలకు లబ్ది చేకూర్చామని అన్నారు. మానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసిన ఏకైక వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారని కొనియాడారు. దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు హామీలను అమలు చేయలేమని ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. పది నెలల కాలం లోనే కూటమి ప్రభుత్వం పై తీవ్ర అసంతృప్తితో ప్రజలు ఉన్నారన్నారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిపోయిందని, లా అండ్ ఆడార్ గాడి తప్పిందని, మహిళలకు రక్షణ లేదన్నారు. బూటకపు హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. జగన్ మోహన్ రెడ్డి గారు వాలంటీర్, సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టి గడప వద్దకే పాలన అందించారన్నారు
ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పశ్చిమ కార్పొరేటర్లు, డివిజన్ ఇంచార్జ్ లు, వివిధ క్లస్టర్ ఇంచార్జ్ లు పాల్గొన్నారు