*Press Note & Electronic Media*
తేదీ: 11-04-2025
విషయం: ఏలూరును పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి సహకరించండి.
* ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి.
ఏలూరు/ ఆగిరిపల్లి, ఏప్రిల్ 11: ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి సహకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో జీరో పావర్టీ- పీ4 ప్రారంభోత్సవ ప్రజావేదిక కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన అన్ని వనరులు అందుబాటులో ఉన్నాయని, భూముల ధర ఎక్కువగా ఉండటం వల్ల పారిశ్రామిక వేత్తలు ముందుకు రావడం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను కేటాయించేందుకు ప్రభుత్వం సహకరించాలని ఎంపీ మహేష్ కుమార్ కోరారు. పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. అలాగే సాగు, తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విన్నవించారు. "ఎక్కడో వ్యాపారం చేసుకుంటున్న మా నాన్న పుట్టా సుధాకర్ యాదవ్ గారిని టీటీడీ చైర్మన్ చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది, బీసీ సామాజిక వర్గానికి చెందిన మా నాన్న సుధాకర్ యాదవ్ గారిని టీటీడీ చైర్మన్ చేయడం అంటే ఆషామాషీ కాదని, బీసీలను రాజకీయంగా పైకి తీసుకురావాలనే సదుద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు. అలాగే కడప జిల్లాలో మూడుసార్లు అసెంబ్లీ టికెట్టు ఇచ్చి సుధాకర్ యాదవ్ గారిని ఎమ్మెల్యేను చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నన్ను ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఏలూరు ఎంపీగా పోటీ చేయించి గెలిపించారు. మంచి మంచి కార్యక్రమాలు మా అందరితో ముందుండి నారా చంద్రబాబు నాయుడు గారు చేయిస్తున్నారని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకున్న యువనేత నారా లోకేష్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల వ్యవధిలోనే నాలుగు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టే పరిశ్రమలు రాష్ట్రాన్ని తీసుకొచ్చారని ఎంపీ మహేష్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం అమలు జరుగుతున్నాయి అంటే ఎన్డీఏ కూటమిలో ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యపడిందని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎంపీ మహేష్ కుమార్ స్పష్టం చేశారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గతంలో టన్ను 13 వేలు ఉన్న పామాయిల్ ధర ఈ రోజు 21 వేలకు గిట్టుబాటు ధర తీసుకువచ్చామని ఎంపీ మహేష్ కుమార్ వెల్లడించారు.
ఇట్లు
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారి కార్యాలయం, ఏలూరు.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కవర్ చేయవలసిందిగా కోరుచున్నాము.