*కృష్ణా జిల్లా పోలీస్ - డ్రంక్ అండ్ డ్రైవ్ లో 18 మంది వ్యక్తులు ఒక లక్ష 80 వేల అపరాధ రుసుము చెల్లింపు*- *గుడివాడ రూరల్ పోలీస్*
కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు ఆదేశాల మేరకు గుడివాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ వి.ధీరజ్ వినీల్ ఆధ్వర్యంలో, గుడివాడ రూరల్ సిఐ ఎస్ ఎల్ ఆర్ సోమేశ్వరరావు పర్యవేక్షణలో గుడివాడ రూరల్ ఎస్సై ఎన్ చంటిబాబు మరియు వారి సిబ్బంది గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2025 సంవత్సరం మొదటి క్వార్టర్ కు గాను స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపే 18 మంది వ్యక్తులపై కేసులు నమోదు చేసి గౌరవ కోర్టు వారి ముందు ఉంచగా వారికి 1,80,000 అపరాధ రుసుము విధించినారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారు భారీ అపరాధ రుసుము చెల్లించవలసి ఉంటుందని.రెండవసారి పట్టుబడిన వారు జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుందని, కావున మద్యం సేవించి వాహనాలు నడపరాదని తెలియజేసినారు.