అదనపు కట్నం కోసం వేధించి, ఆత్మహత్యకు ప్రేరేపింపచేసి

  కృష్ణాజిల్లా పోలీస్




*అదనపు కట్నం కోసం వేధించి, ఆత్మహత్యకు ప్రేరేపింపచేసి, భార్య మరణానికి కారణమైన కేసులో ముద్దాయికి 7 సంవత్సరాలు జైలు శిక్ష మరియు రూ.3000 జరిమానా విధించిన గౌరవ VI ADJ కోర్ట్  మచిలీపట్నం వారు.*


నిందితుడికి శిక్ష పడటంలో సమర్ధవంతముగా విధులు నిర్వహించిన పోలీసు అధికారులను మరియు సిబ్బందిని  కృష్ణా జిల్లా యస్.పి. శ్రీ ఆర్. గంగాధరరావు, ఐ.పి.యస్. గారు ప్రత్యేకముగా అభినందించారు.


▪️వివరాల్లోకి వెళ్తే మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన వెంకటరామ ప్రసాద్ తన యొక్క రెండో కుమార్తెను గూడూరు మండలం ఆకుమరు గ్రామానికి చెందిన రామకృష్ణ కు 2017లో ఇచ్చి వివాహం జరిపించారు. వారికి ఒక ఆడపిల్ల జన్మించగా, ఆడపిల్ల పుట్టిందని కారణం మరియు అదనపు కట్నం పేరుతో భర్త, అత్త వేధింపులు మొదలుపెట్టారు. 


▪️ఆ వేధింపులు తాళలేక 2020 సంవత్సరంలో వివాహిత ఉరివేసుకొని మరణించగా, ఆమె తండ్రి అత్తింటి వారిపై అనుమానంతో మృతురాలి భర్త, అత్తపై కేసు నమోదు చేశారు.  అప్పటి ఎస్సై సిహెచ్ కనకదుర్గారావు గారు కేసు నమోదు చేయగా, డిఎస్పి మహబూబ్ బాషా గారు విచారణ చేపట్టి చార్జ్ షీట్ దాఖలు చేశారు. సాక్షులు అందరూ సకాలంలో కోర్టుకు హాజరు అయ్యేలా ట్రైల్ పూర్తి చేసి, అదే సమయంలో విచారణ ప్రక్రియ సజావుగా పూర్తి చేసినారు.


▪️పబ్లిక్ ప్రాసిక్యూటర్  ఎ. వెంకటేశ్వరరావు గారు బాధితురాలికి న్యాయం చేయాలనే సంకల్పంతో ఎప్పటికప్పుడు విచారణ ప్రక్రియను వేగవంతం చేయిస్తూ వచ్చారు. అయితే మొత్తం సాక్షులను విచారించిన పిమ్మట, నేరం నిరూపణ కావడంతో ఈరోజు 6 వ ADJ కోర్టు  జడ్జ్  A.పూర్ణిమ గారు  నేరస్తునికి 7 సంవత్సరాల జైలు శిక్ష మరియు 3,000/- రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.


 ▪️ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు కోర్ట్ లో ప్రవేశపెట్టి సమర్థవంతంగా ట్రయల్ మానిటరింగ్  పూర్తి చేసి నిందితుడికి శిక్ష పడడంలో క్రియాశీలక పాత్ర పోషించిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని  జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.