మహిళల ఆర్థిక స్వావలంబనే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) సతీమణి కేశినేని జానకీ లక్ష్మి
పశ్చిమ నియోజకవర్గ తెలుగు మహిళా సంఘం ఆధ్వర్యంలో వేడుకలు
మహిళలందరికి ఎంటర్ ప్రెన్యుర్ గా నారా భువనేశ్వరి ఆదర్శం
కేశినేని జానకీ లక్ష్మి ను ఘనంగా సన్మానించిన తెలుగు మహిళలు
విజయవాడ : మహిళలు ఆర్థికంగా ఎదగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయి.ప్రతి కుటుంబంలో ఒకర్ని ఎంటర్ ప్రెన్యూర్ గా తయారు చేయాలనే ఆశయం తో సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఎంటర్ ప్రెన్యూర్స్ గా మారి ఆర్థిక స్వాలంబన సాధించాలనుకుంటున్నారు. అందుకే మహిళలను ప్రోత్సహించేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఎమ్.ఎస్.ఎమ్.ఈ రంగంలో (Micro, Small and Medium Enterprises-సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు) లోన్స్ తీసుకునే మహిళలకు 45 శాతం సబ్సీడీ అందిస్తున్నారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) సతీమణి కేశినేని జానకి లక్ష్మీ తెలిపారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ తెలుగు మహిళ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం బ్రాహ్మాణ వీధిలోని ఎస్.ఆర్. కన్వెన్షన్ లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. మహిళ వాయిద్య కళాకారులతో కేశినేని జానకి లక్ష్మీ తెలుగు మహిళా నాయకులు ఘన స్వాగతం పలికారు. సభ అనంతరం కేశినేని జానకి లక్ష్మీని తెలుగు మహిళా నాయకులు సన్మానించారు. కేశినేని జానకి మంగళవాయిద్యాలు వాయించిన మహిళలను అభినందించి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా కేశినేని జానకీ లక్ష్మీ మాట్లాడుతూ మహిళలుసాధికారత ను సాధించే దిశగా అడుగువేయాలన్నారు. మహిళల శక్తి అనంతం. స్త్రీ తల్చుకుంటే ఏమైనా సాధించగలదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ది కోసం కష్టపడుతుంటే..ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఎంటర్ ప్రెన్యుర్ గా మారి కుటుంబం తో పాటు వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. నారా భువనేశ్వరిని ఆదర్శం తీసుకుని మహిళలందరూ ఎంటర్ ప్రెన్యూర్ గా మారాలన్నారు. మహిళలకు ఎమ్.ఎస్.ఎమ్.ఈ రంగంలో లోన్స్ అందించే అంశం గురించి అవగాహన పెంచేందుకు ఎంపి కేశినేని శివనాథ్ నగర పరిధిలోని అన్ని డివిజన్స్ లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయించారని తెలిపారు. డ్వాక్రా, మెప్పా మహిళా సంఘం సభ్యులతో పాటు మహిళలందరూ ఆర్థికాభివృద్ది సాదించేందుకు ఎంపి కేశినేని శివనాథ్ అందించే సహాయ సహకారులను అందుకోవాలని పిలుపునిచ్చారు. మహిళలు ఒకరిపై ఆధారపడకుండా ఆర్ధికాభివృద్ది సాధిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. ఎమ్.ఎస్.ఎమ్.ఈ రంగంలో లోన్స్ తీసుకునే మహిళలకు 45 శాతం సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా, ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, పశ్చిమ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు సుఖాసి సరిత, ప్రధాన కార్యదర్శి నసీమా, టిడిపి సీనియర్ నాయకురాలు బంకా నాగమణి, 35వ డివిజన్ అధ్యక్షురాలు బుదాలి నందకుమారి, 38వ డివిజన్ అధ్యక్షురాలు పితాని పద్మ, టిడిపి మహిళ నాయకులు పి.దుర్గా, గల్లా మౌనిక, షేక్ మీరాబి లతో పాటు తెలుగు మహిళలు పాల్గొన్నారు.