*ముస్లిం సోదరసోదరిమణులు అందరికి రంజాన్ శుభాకాంక్షలు : ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు దేవినేని అవినాష్*
మత సామరస్యాన్ని పెంపొందించి ఐక్యతను చాటే పర్వదినం పవిత్ర రంజాన్ అని, రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరిసోదరులు అందరికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు దేవినేని అవినాష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నెల రోజులు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టి ఆ అల్లాహ్ కి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ముస్లింలు అందరూ సుఖసంతోషాలతో జీవించేలా ఆ అల్లా అనుగ్రహించలని ఆకాంక్షించారు. వైసీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దే.. మరలా ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్రంలో మరోమారు వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలా ఆ అల్లా దీవెనలు అందించాలని అవినాష్ కోరుకున్నారు.