ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి, పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి
స్థానిక 34వ డివిజన్ గౌసియా మస్జీద్ వద్ద వైసిపి నాయకులు షేక్ మెహబూబ్ (మాబు) ఆద్వర్యంలో సోమవారం నాడు పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ముస్లిం సోదరులు, వైసిపి నాయకులతో కలిసి మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు అనంతరం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుని వడ్డించారు.
ఈ కార్యక్రమంలో 34వ డివిజన్ కార్పొరేటర్, APIDC మాజీ చైర్మన్ బండి పుణ్యశీల, వైసిపి నాయకులు బండి రాజ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు