రాష్ట్రంలో విపరీతంగా పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించి.. ప్రజలపై మోయలేని భారాన్ని నిలుపుదల చేయాలని దళిత బహుజన పార్టీ డి బి పి వ్యవస్థాపక అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ చేశారు. ఈ మేరకు పాయకరావుపేటలో మీడియా వర్కింగ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీల గృహవాసాలకు 100 యూనిట్ల వరకు ఉచితంగా అందించే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని కృష్ణ స్వరూప్ తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులు నేటికీ ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం సరైనది కాదన్నారు. దళిత వడల సామాజిక ఆర్థిక. ఉద్దేశించిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు తక్షణ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గత వార్షిక బడ్జెట్లో ఖర్చు చేయని నిధులను ఈ వార్షిక బడ్జెట్ నిధులలో సబ్ ప్లాన్ నిధులలో వారి అభివృద్ధి కోసం తక్షణమే నిధులు మంజూరు చేయాలని గత ప్రభుత్వ హయాంలో రద్దు అయిన 27 దళితుల సంక్షేమ పథకాలను ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభుత్వం పునరుద్ధరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారికి విజ్ఞప్తి చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ వృత్తి. పీజీ ఇంజనీరింగ్.మెడికల్.లా.కళాశాల విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థుల ట్యూషన్ ఫీజులు స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.