ఆకేపాటిని విమర్శ చేసే స్థాయి నీది కాదు స్థాయికి తగ్గ మాటలు మాట్లాడాలి

 ఆకేపాటిని విమర్శ చేసే స్థాయి నీది కాదు

స్థాయికి తగ్గ మాటలు మాట్లాడాలి

     సుండుపల్లి -  న్యూస్ 9






రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ని విమర్శ చేసే స్థాయి టీడీపీ నేత మేడా విజయ్ శేఖర్ రెడ్డి కి లేదని అన్నమయ్య జిల్లా రైతు విభాగం వై కా పా అధ్యక్షులు ఆరం రెడ్డి,సుండుపల్లి కన్వీనర్ రామస్వామి రెడ్డి అన్నారు.ఇటీవల కాలంలో రాజంపేట శాసన సభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి,ఎంపీ మిథున్ రెడ్డి,పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి,జగన్ మోహన్ రెడ్డిల గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న మేడా బాబు తన గతం ఏంటో చూసుకోవాలని వారు విమర్శించారు.సుండుపల్లిని పూర్తిగా సర్వనాశనం చేసి,అనేక అక్రమాలు చేసిన మేడా విజయ్ నేడు మాట్లాడటం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది అని వారు అన్నారు.ఇంకోసారి ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వారు అన్నారు. ఇకనైనా మంచి రాజకీయం చెయ్యాలని ఇంతటి కూటమి సునామి లో సైతం రాజంపేట లో గెలిచిన చరిత్ర ఉన్న అమర్నాథ్ రెడ్డి ని మిథున్ రెడ్డి ని విమర్శలు చెయ్యడం మానుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు రెడ్డి భాస్కర్. జేసీఎస్ కన్వీనర్ రహిమాన్ ఖాన్,కో ఆప్షన్ ఖలీం బాషా, మైనార్టీ వైఎస్ఆర్సిపి మండల  యువ నాయకుడు మజహార్,ఎంపిటిసి నాగేశ్వరావు. పార్టీ నాయకులు పాల్గొన్నారు.