మచిలీపట్నం సబ్ జైల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలకు పరామర్శ
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లలో జరిగిన ఘర్షణలో 16 మంది వైసీపీ కార్యకర్తలు అక్రమ అరెస్ట్
అక్రమ అరెస్టై రిమాండ్ లో ఉన్న కార్యకర్తలను పరామర్శించిన కృష్ణాజిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి పేర్ని నాని , ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ , జగ్గయ్యపేట వైసీపీ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావు
*మాజీ మంత్రి పేర్ని నాని*
పెనుగంచిప్రోలు తిరునాళ్లలో పోలీసుల సమక్షంలోనే టిడిపి నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు
విధ్వేషపూరితంగా మాట్లాడుతూ రెచ్చగొట్టారు
వైసీపీ ప్రభల పై రాళ్లు , కర్రలు విసిరేశారు
వైసీపీ శ్రేణులను నోటికొచ్చినట్లు తిట్టారు
టిడిపి వాళ్లు రెచ్చగొడుతున్నా పోలీసులు కనీసం కట్టడిచేయలేదు
టిడిపి కార్యకర్తలు రాళ్లు విసురుతుంటే ఆత్మరక్షణలో భాగంగా వైసీపీ వాళ్లు అడ్డుకున్నారు
టిడిపి కార్యకర్తలు నానా గొడవ చేస్తుంటే పోలీసులు కనీసం స్పందించలేదు
తిరునాళ్లలో గొడవ జరిగినపుడు లేని వాళ్లను పోలీసులు ముద్ధాయిలుగా చేర్చారు
జాతరలో ప్రభలకు పూజలు చేస్తున్న పూజారి కుమారుడిని కూడా అరెస్ట్ చేశారు
వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నవారి పై పోలీసులు అన్యాయంగా అక్రమ కేసులు పెట్టారు
అసలు ఈరాష్ట్రంలో చట్టం ,ధర్మం , న్యాయం ఉందా
పోలీసులు పసుపు పచ్చ కండువా వేసుకున్న వారిలా ఉద్యోగం చేస్తున్నారు
కిరాయి మూకలు,రౌడీ మూకలకు పోలీసులు వత్తాసు పలకడం దురదృష్టకరం
టిడిపి వాళ్లు విసిరిన రాళ్లతో దెబ్బలు తగిలితే వైసీపీ వారిని పోలీసులు అరెస్ట్ చేశారు
ఖాకీ చొక్కాలేసుకున్న పోలీసులకు ఇది ధర్మమేనా
చట్టాన్ని టిడిపికి చుట్టంలా మార్చేసిన ఖాకీలను న్యాయం ముందు నిలబెడతాం
టిడిపి పార్టీ ఖాజానా నుంచి మీకు జీతాలివ్వడం లేదని పోలీసులు గుర్తుంచుకోవాలి
అమాయకుల పై హత్యాయత్నం కేసుల్లో ఇరికించడం దుర్మార్గం
*ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు , దేవినేని అవినాష్*
వైసీపీ ప్రభకంటే ముందు టిడిపి ప్రభ వెళ్లాలని పెనుగంచిప్రోలులో పోలీసులు ఆపేశారు
టిడిపి కార్యకర్తలు చేసిన దాడిలో పోలీసులు గాయపడ్డారు
వైసీపీ కార్యకర్తల పై పోలీసులు తప్పుడు కేసు పెట్టారు
వైసీపీలో యాక్టివ్ గా ఉండే కార్యకర్తల పై తప్పుడు కేసులు పెడుతున్నారు
తప్పుడు కేసు పెట్టి 16 మందిని జైల్లో పెట్టారు
జైల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలను పరామర్శించాం
పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో వారికి ధైర్యం చెప్పాం
తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసులు తస్మాత్ జాగ్రత్త
అలాంటి వారిని చట్టం ముందు నిలబెడతాం
టిడిపి నేతలు పేర్లు ఇస్తే వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు
వీలైనంత త్వరలో జైల్లో ఉన్నవారందరినీ బయటికి తెస్తాం
*తన్నీరు నాగేశ్వరరావు , జగ్గయ్యపేట వైసీపీ ఇంఛార్జి*
తిరుపతమ్మకు పసుపుకుంకుమ ఇవ్వడం ఆనయవాతీగా వస్తోంది
టిడిపి పార్టీ కార్యకర్తలు వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టారు
వైసీపీ శ్రేణులు సంయమనంగా ఉన్నప్పటికీ టిడిపి పార్టీ కార్యర్తలు రాళ్లు , బాటిల్స్ విసిరారు
ఈ ఘటనలో పోలీసులు ఏకపక్షంగా 25 మందికి పైగా వైసీపీ కార్యకర్తల పై కేసులు పెట్టారు
16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు
చదువుకున్న యువకులను కావాలని కేసుల్లో ఇరికించారు
టిడిపి ఆఫీస్ నుంచి పేర్లు పంపించిన వారి పై కేసులు పెట్టారు
గత యాభైఏళ్లలో ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదు
తప్పుడు కేసులు పెట్టిన పోలీసుల పై న్యాయపోరాటం చేస్తాం
తప్పుడు కేసులతో వైసీపీ కార్యకర్తలను అణచివేయలేరు