బిల్డ‌ర్స్ కన్స్ట్రక్షన్ రంగంలో లెటెస్ట్ టెక్నాల‌జీ అందిపుచ్చుకోవాలి


బిల్డ‌ర్స్  కన్స్ట్రక్షన్ రంగంలో లెటెస్ట్ టెక్నాల‌జీ అందిపుచ్చుకోవాలి 

ఎపి  కన్స్ట్రక్షన్ ఎక్స్ పో- కన్స్ట్రక్షన్ ఇండ‌స్ట్రీ కాన్ క్లేవ్ లో ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)









విజ‌య‌వాడ : అమరావతి నిర్మాణ విషయంలో సీఎం చంద్రబాబు చాలా విజన్‌తో ముందుకు వెళ్తున్నారు. అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణ ప‌నులు త్వ‌ర‌లో ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకు సంబంధించిన టెండ‌ర్లు మ‌రో మూడు నాలుగు రోజుల్లో ఓపెన్ చేయ‌బోతున్నారు. ఈ స‌మయంలో బిల్డ‌ర్స్, కాంట్రాక్ట‌ర్స్ కి కన్స్ట్రక్షన్ రంగంలో లెటెస్ట్ టెక్నాల‌జీ పై అవ‌గావ‌న పెంచే విధంగా ఎపి  కన్స్ట్రక్షన్ ఎక్స్ పో నిర్వ‌హించ‌టం చాలా సంతోషంగా వుంది. ఈ ఎక్స్ పో ద్వారా  బిల్డ‌ర్స్  కన్స్ట్రక్షన్ రంగంలో లెటెస్ట్ టెక్నాల‌జీ అందిపుచ్చుకుని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. 


 విజయవాడలో ఎస్ ఎస్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా మార్చి 4వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వ‌హిస్తున్న  ఏపీ కన్‌స్ట్రక్షన్ ఎక్స్ పోను బుధ‌వారం ఎంపి కేశినేని శివ‌నాథ్ సంద‌ర్శించారు.  ఈ ఎక్స్ పో కు విచ్చేసిన ఎంపి కేశినేని శివ‌నాథ్ కు ఎక్స్ నిర్వ‌హకులు, షైనీ గ్రూప్ అధినేత షేక్ బాజీ స్వాగ‌తం ప‌లికారు.  ఈ ఎక్స్ పో లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) సందర్శించి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎక్స్ పోలో నిర్వ‌హించిన‌  కన్స్ట్రక్షన్ ఇండ‌స్ట్రీ కాన్ క్లేవ్ లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు. 


ఈజీ ఆఫ్ డూయింగ్ కన్స్ట్రక్షన్  బిజినెస్ విత్ యూజ్డ్ టెక్నాల‌జీ ఇదే ఎక్స్ పో ల‌క్ష్యమ‌న్నారు. అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతంలోని బిల్డ‌ర్స్ కి నిర్మాణ రంగంలో టెక్నాల‌జీ పై అవ‌గాహ‌న పెంచేందుకు ఈ ఎక్స్ పో చాలా దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు. నిర్మాణ రంగంలో కొత్త విధానాలు వచ్చాయని..ఆ  సాంకేతికతను ఉపయోగించుకొని నిర్మాణాలు చేపడితే బాగుంటుంద‌న్నారు.  బిల్డ‌ర్స్ కాంట్రాక్ట‌ర్స్  కి లెటెస్ట్ టెక్నాల‌జీ ను ప‌రిచ‌యం చేసేందుకు ఇలాంటి ఎక్స్ పోలు మ‌రిన్నీ రావాల్సిన అవ‌స‌రం వుంద‌న్నారు. ఎపిలో కన్స్ట్రక్షన్ ఇండ‌స్ట్రీ పెర‌గ‌బోతుంది. రాబోయే కాలంలో రాష్ట్రంలో ఇన్ ఫ్రా ప్రాజెక్టులు మాత్ర‌మే కాకుండా స్టేడియాలు, రెసిడెన్షియ‌ల్ ప్రాజెక్టులు రాబోతున్నాయన్నారు. కన్స్ట్రక్షన్ రంగంలో రాష్ట్రానికి  హైద‌రాబాద్ ను మించిన గుర్తింపు రావాలన్నారు.  


ఈ కార్య‌క్రమంలో  ఎ.పి.సి.ఆర్.డి.ఎ చీఫ్ ఇంజనీర్ ఎమ్.శ్రీనివాస‌రావు, ఐ.జి.బి.సి చైర్మ‌న్ డాక్ట‌ర్ సందీప‌ని, సి.ఎఫ్‌.ఐ వైస్ ప్రెసిడెంట్ కిర‌ణ్ బాబు, వింట‌ర్స్ ప్ర‌తినిధి ప్రీతిశ‌ర్మ‌, ఐ.ఐ.ఏ ప్రెసిడెంట్ వేణుగోపాల్, ఐ.సి.ఐ డైరెక్ట‌ర్ వి.జ‌గ‌దీష్‌, టిడిపి రాష్ట్ర అధికార ప్ర‌తినిధి ర‌ఫీ, టిడిపి నాయ‌కుడు మాజీ కార్పొరేటర్  కాకు మ‌ల్లిఖార్జున యాద‌వ్ పాల్గొన్నారు.