ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ మాస ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేసిన మర్రి రాజశేఖర్..

 *ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ మాస ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేసిన మర్రి రాజశేఖర్..*




*అల్లా పై నమ్మకం, మహమ్మద్ ప్రవక్త పై విశ్వాసంతో సకల మానవాళికి సందేశాన్నిచ్చే దివ్య ఖురాన్ దైవ గ్రంథంగా అవతరించిన మాసం ఈ రంజాన్ మాసం.ముస్లిం సోదర, సోదరీమణులు అత్యంత పవిత్రంగా భావించే ఈ రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష చేయడం జరుగుతుంది.    వినీలాకాశంలో శనివారం రాత్రి నెలవంక కనిపించడంతో  ఈరోజు నుండి నెల రోజులు ఉపవాస దీక్షలు పాటించడం మొదలవుతున్న సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు  శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్  మాట్లాడుతూ ఉపవాసాలు ఉండేవారు  ప్రతిరోజు ఐదు పూటల నమాజులు చేయడం, పేద వర్గాల వారికి దానధర్మాలు చేయడం ఈ నెల రోజులు కఠిన ఉపవాస దీక్షలు ఆచరించడం అనేది ఇస్లాం మత నిబంధన అని ఇది చాలా గొప్పదని అన్నారు.*


*రంజాన్ సమయంలో ఉపవాసం ఉండడం వల్ల వారికి ఆత్మ శుద్ధి అవుతుంది అలాగే ఆధ్యాత్మిక అవగాహన కూడా పెరుగుతుందని అన్నారు.*


*ఈ కఠిన ఉపవాసం ఉండడం వల్ల ఆకలి,దాహంపై నియంత్రణ వస్తుంది. తినడానికీ, తాగడానికి తగినంత సౌకర్యాలు లేని వారి కష్టాలను కూడా వారు అర్థం చేసుకోని దీని వల్ల దానధర్మాలు చేయాలన్న ఆలోచన కూడా వస్తుందన్నారు.*


*రంజాన్ అనేది కుటుంబం, సమాజం కలిసి చేసుకునే పండుగని, ఉపవాసం విరమించేటప్పుడు భోజనాన్ని అందరూ కలిసి పంచుకొని తింటారు. ఇది మానవ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్  అన్నారు.*