వైయస్సార్ కాంగ్రెష్ పార్టీ కమ్మవారిపాలెం ఎంపీటీసీ సభ్యురాలు పెసరవెల్లి రమాదేవి గారిని ఏకగ్రీవం

 ఎన్టీఆర్ జిల్లా / నందిగామ :

నందిగామ ఎంపీపీ గా *పెసరమేల్లి రమాదేవి* ఏకగ్రీవం.



ఇచ్చిన మాట ప్రకారం పెసరమేల్లి రమాదేవికి అవకాశం కల్పించిన నియోజకవర్గ సమన్వయకర్త *డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గారు*, ఎమ్మెల్సీ *డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గార్లు.*


27/03/2025, బుధవారం.


 స్థానిక నందిగామ మండల పరిషత్ కార్యాలయంలో 

 జరిగిన ఎంపీపీ ఎన్నికలలో  వైయస్సార్ కాంగ్రెష్ పార్టీ కమ్మవారిపాలెం ఎంపీటీసీ సభ్యురాలు పెసరవెల్లి రమాదేవి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


   అనంతరం ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు గార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలసి పెసరమేల్లి రమాదేవి గారిని  ఎంపీపీ సీట్ లో కూర్చోబెట్టి సత్కరించారు.


 ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ  రమాదేవి ఎంపీపీ గా ఎన్నికైనందుకు సంతోషంగా ఉందని, ఎంపీటీసీ సభ్యులందరూ నిబద్ధతతో పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నారని వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.


పార్టీ లో  ప్రతిఒక్కరికి   అవకాశాలు వస్తాయని ప్రలోభాలకు  లోనవ్వకుండా నిలబడిన వారే నిజమైన నాయకులు అవుతారని అన్నారు.


ఈ కార్యక్రమం లో  జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు గారు, నందిగామ మండల జడ్పీటీసీ గాదెల వెంకటేశ్వరరావు,KDDC బ్యాంకు మాజీ డైరెక్టర్ కొమ్మినేని రవిశంకర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, పాల్గొని నూతన ఎంపీపీ పెసరమేల్లి రమాదేవి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.