పదవీ విరమణ చెందిన సిబ్బందికి ఆత్మీయ వీడ్కోలు పలికిన జిల్లా ఎస్పీ శ్రీ ఆర్.గంగాధరరావు, ఐపీఎస్.,_
_సుదీర్ఘకాలం పాటు పోలీసు శాఖకు విశిష్ట సేవలు అందించి నేడు పదవి విరమణ చెందుతున్న ఇద్దరు పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ శ్రీ ఆర్. గంగాధరరావు, ఐపీఎస్ గారు పోలీస్ క్యాంపు కార్యాలయంలో పదవీ విరమణ చెందుతున్న సిబ్బంది కుటుంబ సభ్యుల సమక్షంలో శాలువాతో సత్కరించి, జ్ఞాపికలు బహుకరించి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు._
*ఈ సందర్భంగా ఎస్పీ గారు వారితో మాట్లాడుతూ*
▪️ఇంతకాలం పాటు పోలీస్ శాఖకు మీరు అందించిన సేవలు అభినందనీయమని, విరమణానంతరం మీరు అందరూ తప్పనిసరిగా ఆరోగ్యంపై దృష్టి సారించాలని, వచ్చిన ప్రయోజనాలను దుర్వినియోగం కానివ్వకుండా జాగ్రత్తగా వాడుకోవాలని తెలియజేశారు.
▪️ఏ సమయంలో ఏ సహాయం కావాలన్నా పోలీస్ శాఖ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని, విరమణ చెందిన మీరంతా పోలీస్ కుటుంబ సభ్యులైనని తెలిపారు
*పదవి విరమణ చెందిన సిబ్బంది*
1.SI - 777 A.K జిలాని
2.ASI - 935 V.S.S ప్రసాద్