గ‌వ‌ర్న‌ర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ కు స్వాగ‌తం









గ‌వ‌ర్న‌ర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ కు స్వాగ‌తం ప‌లికిన ఎసిఎ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)


వైజాగ్ : ఐపీఎల్ లీగ్ లో భాగంగా సోమవారం వైజాగ్  ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జ‌రిగిన  ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌ర్సెస్ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ క్రికెట్ మ్యాచ్ ను వీక్షించేందుకు విచ్చేసిన గ‌వ‌ర్న‌ర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, స‌మీరా న‌జీర్ దంప‌తుల‌కు ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు, ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) , ఎసిఎ కార్య‌ద‌ర్శి రాజ్య‌స‌భ ఎంపి సానా స‌తీష్‌, ఎసిఎ కోశాధికారి దండ‌మూడి శ్రీనివాస్ ల‌తో క‌లిసి పుష్పగుచ్చం అందించి ఘ‌న‌స్వాగ‌తం ప‌లికి జ్ఞాపిక‌ను కూడా బ‌హుక‌రించారు. అనంత‌రం గ‌వ‌ర్న‌ర్ దంప‌తుల‌తో క‌లిసి క్రికెట్ మ్యాచ్ వీక్షించారు. త‌మ ఆహ్వానాన్ని మ‌న్నించి క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు వ‌చ్చిన గ‌వ‌ర్న‌ర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ కు ఎపిఎ అధ్య‌క్షుడు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)  సోష‌ల్ మీడియా ద్వారా ద‌న్య‌వాద‌ములు తెలిపారు.