ది 29 మార్చి 2025న న్యూస్9 నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో ఎస్సీ కాలనీ లో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ పరిరక్షణ
సమితి కార్యకర్తల సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు సిహెచ్ సుబ్బారావు పాల్గొని మాట్లాడుతూ
1)ఎస్సీలు నివాసం ఉంటున్న ప్రాంతాలలో సిమెంటు రోడ్లు మురికి కాలవలు త్రాగునీటి వసతి మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులు కొరకు 40 శాతానికి పైగా ఎస్సీలు ఉన్న రాష్ట్రంలో 1027 గ్రామాలలో ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం దాంతోపాటు ఉపాధి హామీ పథకం స్వచ్ఛంద కార్పొరేషన్ ఇతర కేంద్ర రాష్ట్ర పథకాలను సంధానించి ఒక్కొక్క గ్రామంలోని ఎస్సీ నివాసాల యందు 60 నుంచి 70 లక్షలు ఖర్చు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం హర్షనీయమని
2) అయితే ప్రతి గ్రామంలో ఉన్న ఎస్సీ వాడల యందు కనీసం ఒక కోటి రూపాయలు తగ్గకుండా నిధులు హెచ్చించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాం.
3), వారికి కేటాయించిన నిధులు పక్కాగా వారు నివాసం ఉండే ప్రాంతాల్లోనే మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని,
4) రాజకీయాలకు అతీతంగా ఎలాంటి పక్షవాతం లేకుండా వారికి కేటాయించిన నిధులు ఎస్సీ కాలనీలో నందు మౌలిక వసతుల నిమిత్తం ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం
5), దీనికి సంబంధించిన కాంట్రాక్టు వర్క్స్ ఎస్సీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం.
6) నిధుల వినియోగములో ఎక్కడ కూడా దుబారా లేకుండా చూడవలసిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. ఈ కార్యక్రమంలో
తాటి గిరి జయరావు
వెచ్చర్ల శేషులు
సంకూరి దేవరాజు
తాటిగిరి కిరణ్
విప్పర్ల సంటి
కే ప్రకాష్ రావు