ఉప సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన మరీదు ఉషారాణి

 *పెద్ద ఆవుటపల్లి ఉప సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం

ఉప సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన మరీదు ఉషారాణి*



గన్నవరం నియోజకవర్గం, ఉంగుటూరు మండలంలోని పెద్ద ఆవుటపల్లి గ్రామ ఉపసర్పంచ్ ఎన్నిక ప్రిసైడింగ్ అధికారి టీ.వీ.ఎస్.ఆర్.కె ప్రసాద్ ఆధ్వర్యంలో ఈరోజు అనగా గురువారం ఉదయం నిర్వహించారు.


జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉప సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం వారు ఇచ్చిన ఆదేశాల మేరకు గన్నవరం నియోజకవర్గం, ఉంగుటూరు మండలంలోని పెద్ద ఆవుటపల్లి గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక ప్రిసైడింగ్ అధికారి టీ.వీ.ఎస్.ఆర్.కె ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నిర్వహించారు. పెద్ద ఆవుటపల్లి ఉప సర్పంచ్ గా 8వ వార్డు సభ్యురాలు అయిన మరీద్ ఉషారాణి (టిడిపి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉప సర్పంచ్ గా ఎన్నికైన మరీదు ఉషారాణికి ప్రిసైడింగ్ అధికారి టి.వి.ఎస్.ఆర్.కె ప్రసాద్ ధ్రువీకరణ పత్రం అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. 


ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు కొండేటి వెంకటేశ్వరరావు, మండల టిడిపి ప్రధాన కార్యదర్శి ఆళ్ల హనోక్, గన్నవరం ఎంపీటీసీ సభ్యులు పడమట రంగారావు, పెద్ద ఆవుటపల్లి గ్రామ టిడిపి అధ్యక్షులు మున్నా రామకృష్ణ, కుందేటి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.