డీఆర్‌డీఓ ఛైర్మన్ డాక్టర్ సమీర్ విక్రాంత్‌తో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) భేటీ





*డీఆర్‌డీఓ ఛైర్మన్ డాక్టర్ సమీర్ విక్రాంత్‌తో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) భేటీ*


న్యూఢిల్లీ: విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) బుధవారం ఢిల్లీలోని డీఆర్‌డీఓ భవన్‌లో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ఛైర్మన్ డాక్టర్ సమీర్ విక్రాంత్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.


ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్, డీఆర్‌డీఓ ఛైర్మన్‌కు తిరుపతి ప్రసాదం అందజేశారు. వీరిద్దరూ రక్షణ రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.



ఎపి నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి లో భాగ‌మైన విజ‌య‌వాడ ప‌రిస‌ర ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి రక్షణ ఉత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ఎంపీ శివనాథ్ (చిన్ని) కోర‌గా, డీఆర్‌డీఓ ఛైర్మన్ డాక్టర్ సమీర్ విక్రాంత్ ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలిస్తామని తెలిపారు.