జై భీం సినిమా తరహాలో పోలీసు లాకప్ డెత్....

 జై భీం సినిమా తరహాలో పోలీసు లాకప్ డెత్....

రెల్లి యువకుడు బంగారు యశ్వంత్ బాబు హత్య పై సమగ్ర విచారణ జరిపి ముద్దాయిలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి... 



 యశ్వంత్ తల్లీ కుటుంబ సభ్యులను పరామర్శించిన కెవిపియస్ ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి, ఏలూరు జిల్లా కార్యదర్శి అందెగుల ప్రాన్సిస్, నాయకులు మంచల ఇస్కాక్ తదితరులు

       ఏలూరు నగరంలో తంగేళ్ల ముడికి చెందిన రెల్లి యువకుడు బంగారు యశ్వంత్ ద్విచక్ర వాహనం దొంగిలించాడని మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న సిసిఎస్ పోలీసులు కాళ్లు చేతులకు సంకెళ్లు వేసి చిత్రహింసలకు గురి చేసినందువల్లే మరణించాడని ఇది ముమ్మాటికీ పోలీసులు చేసిన హత్య అని దీనిపై సమగ్ర విచారణ జరపాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు.

       పోలీసుల లాఠీ దెబ్బలకు చనిపోయిన తరువాత కాలువలో పడవేసి పోలీసులు కట్టుకధలు అల్లుతున్నారని, తల్లీదండ్రులను భయపెట్టి పోస్ట్ మార్టం చెయించడమే కాకుండా శవాన్ని కాల్చివేశారన్నారు. మృతుడి శరీరంపై గాయాలు ఉన్నాయని చెబుతున్న పట్టించుకోలేదన్నారు. సాంప్రదాయాలు ఉన్నప్పటికీ అనుమానాస్పద మరణం జరిగినప్పుడు ఎలా కాలుస్తారు? చిత్రహింసలకు గురిచేసి ముక్కు పచ్చలారని యువకుడిని పోలీసులు హత్య చేశారన్నారు . దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. హత్య కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 

   హోం మంత్రి గారు స్పందించారు...

    రాష్ట్రంలో దళితులపై దుర్మార్గమైన దాడులు, హత్యలు జరుగుతుంటే రాష్ట్ర హాంశాఖామాత్యులు స్పందించాలని వాస్తవాలు పరిశీలన చేసి పోలీస్ స్టేషన్లలో చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన పోలీసులపై వస్తున్న ఆరోపణలపై నిజనిజాలు నిగ్గు తెల్చాలని కోరారు. ఈ దుర్మార్గమైన దారుణమైన ఘటనపై దళిత గిరిజన ప్రజా సంఘాలు అంబేద్కర్ వాదులు స్పందించాలని కోరారు.