దేవరంపాడు నేతి వెంకన్న స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన అటవీశాఖ అధికారులు
నేడు తిరునాళ్లకు సంబంధించి పొంగళ్ళు చేనేయకుండా భారీ గుంతలు తీయించిన అటవీ శాఖ అధికారులు
తీయించిన భారీ గుంతల్లో ఎవరైనా పడితే ఎవరు సమాధానం చెప్పాలి ప్రజల వాహనాల దగ్గర డబ్బులు తీసుకుంటాం పొంగళ్ళు మాత్రం వండనీయం
తిరుణాల స్వామి వారిది ఆదాయం మాత్రం అటవీశాఖ అధికారులు ది తరాలు మారుతున్న స్వామివారి కీ అభివృద్ధి మాత్రం నోచుకోవడం లేదు
మండిపడుతున్న హిందూ సంఘాలు
పల్నాడు జిల్లా న్యూస్ 9
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజక వర్గం రాజుపాలెం మండలం దేవరంపాడు శివారులో ఉన్నటువంటి పల్నాడు తిరుపతిగా పేరుగాంచిన నేతి వెంకన్న స్వామి మొదటి వారం తిరునాళ్ల శనివారం ప్రారంభమైంది. ఈ క్రమంలో స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో దేవస్థానం వైపు నుండి ఎడమ చేతి వైపు పెద్ద ఎత్తున మహిళలు తిరుణాలకు సంబంధించి పొంగళ్ళు వండుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో అక్కడ అటవీ శాఖకు సంబంధించి పార్కును ఏర్పాటు చేశారు. పార్కు ఏర్పాటు చేయడమే కాకుండా లోపలకి ఎవరూ వెళ్లకుండా కంచె ఏర్పాటు చేశారు. కానీ దేవస్థానం ప్రాంగణం నుండి కొంతమంది మహిళలు లోపలకు వెళ్లడానికి ప్రయత్నం చేయగా అటవీ శాఖ అధికారులు అడ్డుకొని మరి ఇది మా ప్రాంతం అంటూ భారీ గుంతలను తీయడం జరిగింది. భారీ గుంతలను ఏర్పాటు చేసిన క్రమంలో స్థానిక ప్రజలు మహిళలు మండిపడుతున్నారు. గుడి దగ్గరకు వెళ్లే క్రమంలో వాహనాలు పార్కింగ్ అంటూ ఒక్కొక్క వాహనానికి రుసుము వసూలు చేస్తున్నారు. గుడి దగ్గర తిరుణాలకు ఏర్పాటు చేసుకునే ప్రతి షాపు దగ్గర నగదు వసూలు చేస్తున్నారు. కానీ విద్యుత్తు లేని అడవి శాఖ అధికారులు మాత్రం దేవస్థానానికి సంబంధించిన విద్యుత్తును వాడుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. మరి ఇన్ని సంవత్సరాలుగా లేని కంచె అటవీ శాఖ అధికారులకు ఈ రోజే గుర్తొచ్చిందా అని చివరకు దేవుడికి ప్రసాదం వండుకునేటప్పుడే తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా గుంతలు ఏర్పాటు చేశారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. తిరునాళ్లకు సహకరించని అడివిశాఖ అధికారులపై తమ దేవస్థానం పేరు చెప్పుకొని వాహనాల దగ్గర వసూలు చేస్తున్న నగదు విషయంలో తమ దేవస్థానం పేరు చెప్పుకొని షాపుల దగ్గర వసూలు చేస్తున్న నగదు విషయంలో ప్రభుత్వం స్పందించాలని తమ మనోభావాలను దెబ్బతీసిన అటవీశాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే తీసిన భారీగుంతల్లో ఎవరైనా పడి ప్రమాదం జరిగితే ఎవరు దానికి బాధ్యత వహించాలని కావున ఈరోజు సాయంత్రం కల్లా ఆ భారీ గుంతలను పూడ్చే విధంగా అధికారులు పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్పందించి పల్నాడు తిరుపతిగా చెప్పుకునే స్వామివారికి అడవి శాఖ పరిధిలోని భూమిని స్వామివారికి సుమారు ఒక 50 ఎకరాలైన కేటాయించే విధంగా పనిచేయాలని స్వామివారి దేవస్థానం అభివృద్ధికి సహకరించాలని ప్రజలు కోరుతున్నారు.