**మహిళలు అన్ని రంగాలలో ముందుండాలి* బిజెపి సుండుపల్లి మండల అధ్యక్షులు యస్.వి. రమణ గౌడ్
అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలంలోని చిన్న గొల్లపల్లి గ్రామపంచాయతీలో బిజెపి సుండిపల్లి మండల అధ్యక్షులు యస్.వి. రమణ గౌడ ఆధ్వర్యంలో గ్రామ పరిధిలోని మహిళలతో మహిళా దినోత్సవ వారోత్సవ ముందస్తు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ సుండుపల్లి మండల అధ్యక్షులు మాట్లాడుతూ మహిళలు చదువుతోపాటు, అన్ని రంగాల్లో ముందుండి రాణించాలని సూచించారు... చాలామంది మహిళలు మగవారితో పాటు అన్ని రంగాల్లో సమానంగా రాణిస్తున్నారన్నారు. మన దేశ ప్రధాని భేటీ పడవో భేటీ బాచోవో చాలా మంచి కార్యక్రమం పెట్టడం వలన మహిళలకు ఇంకా అన్నిరంగాలల్లో ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుందని తెలియజేశారు. డ్వాక్రా సంఘాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు రుణాలు అందించడమే కాకుండా ఉపాధిని కూడా కల్పిస్తున్నాడని అన్నారు...ప్రతి మహిళ డ్వాక్రా సంఘం లో సభ్యురాలుగా చేరాలని కోరారు. గ్రామ పంచాయితీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రేపు( మార్చి 08) న ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ప్రతి ఒక్క మహిళ అక్షరాష్యురాలు కావాలని అప్పుడే కుటుంబం అభివృద్ధితో పాటు పిల్లలు విద్యావంతులు అవుతారని ఉన్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు. బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి శివశంకరయ్య మాట్లాడుతూ గ్రామంలో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగినా విద్యార్థినిలు, మహిళలను యువకులు, పురుషులు వేధించిన, బాల్యవివాహాలు జరుగుతున్నట్లు మీ దృష్టికి వచ్చినట్లయితే కచ్చితంగా హెల్ప్ లైన్ నెంబర్ 1098 కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు.మహిళా హక్కుల గురించి వారికి వివరించారు. మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా మహిళలతో బీజేపీ సుండుపల్లి మండల అధ్యక్షులు రమణ గౌడ్ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో చిన్నగొల్లపల్లి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు