కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్య కోసం బడ్జెట్లో 30% కేటాయించాలి.....

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్య కోసం బడ్జెట్లో 30% కేటాయించాలి భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సిహెచ్ సుబ్బారావు



24 మార్చ్,న్యూస్9, నాదెండ్ల

     భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు విద్య కొరకు30% నిధులు కేటాయించి విద్యకు దూరమైన అన్ని కులాల వారికి విద్య అవకాశాలు కల్పించాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నోసార్లు పార్లమెంట్లో పోరాటం చేశారని భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సిహెచ్ సుబ్బారావు అన్నారు. ఆదివారం మండలంలోని గణపవరం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ సమాజంలో సామాజిక సాంస్కృతిక ఆర్థిక రాజకీయపరమైన అసమానతలు దీర్ఘకాలం కొనసాగడం వల్ల సామాజిక సామరస్యత సహజీవనం ప్రమాదంలో పడిపోయిందని అన్నారు. భారతదేశంలో కుల వ్యవస్థ పటిష్ఠంగా నిర్మాణం చేయబడిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్య కోసం కేవలం 6% మాత్రమే కేటాయింపు చేస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఆయన తెలిపారు. జనాకర్షణ పథకాలు సంక్షేమ పథకాలు పేదరిక నిర్మూలన చేయకపోగా అన్ని వర్గాల ప్రజల్లో నిరవధిక పేదరికం పెరిగిపోయింది ఆందోళన వ్యక్తం చేశారు. మేధావుల వలస కారణంగా అమెరికా డాలర్ బలపడి భారతదేశంలో రూపాయి విలువ కోల్పోయిందని తెలిపారు ఈ సమావేశంలో విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి బి రాజేశ్వరరావు, డి కొండయ్య, ఎస్ వెంకటేష్ ,ఎస్ అంజిబాబు కే కోటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.