పత్రిక ప్రకటన
మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 సెక్షన్ 30 ప్రకారం ప్రతి జిల్లాలో మానవ హక్కుల
కోర్టులు ఉండాలి కానీ ఈ చట్టం అమలు చేయడం లేదని మానవ హక్కుల కౌన్సిల్ గౌరవ అధ్యక్షులు ప్రొ. వై. వై సత్యనారాయణ చర్చా వేదిక లో అన్నారు. మానవ హక్కుల న్యాయస్థానాలలో హక్కుల ఉల్లంఘనలనుండి ఉత్పన్నమయ్యే నేరాలను వేగవంతమైన విచారణలు చేయడానికి రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమ్మతితో ప్రతి జిల్లాలో సెషన్స్ కోర్టును మానవ హక్కుల న్యాయస్థానం గా ఏర్పాటు చేసినా బా ధితులకు సత్వర న్యాయం లభించడం లేదని అన్నారు.
ఈ చట్టం అమలులోకి వచ్చి 32 సం. లయినా పౌరులకు మానవ హక్కుల కోర్టుల గురించి అవగాహన లేదని మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ చట్టం ప్రకారం ప్రత్యేక న్యాయమూర్తి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం జరగలేదని అన్నారు. ముఖ్యం గా మానవ హక్కుల కోర్టులలో విచారించగల నేరాలను పేర్కొనలేదని అన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ సెక్షన్ 30, 31 ల సవరణకు సిఫారసు చేసినా పార్లమెంట్ చర్యలు తీసుకోలేదని అన్నారు. మానవ హక్కుల న్యాయస్థానాలను ప్రతి జిల్లా లో సన్నద్ధం చేసి తగిన సిబ్బందిని హక్కుల ఉల్లంఘనలను చట్టాలుగా రూపొందించాలని పాల్గొన్న న్యాయవాదులు అన్నారు. మానవ హక్కుల న్యాయ స్థానాలను ఏర్పరిచేవరకు పౌరులలో విధ్యార్డులలో అవగాహన చర్చా కార్యక్రమాలు నిర్వహించాలని కాకినాడ జిల్లా మానవ హక్కుల కౌన్సిల్ సభ్యులు హబీబ్ బాషా అన్నారు. ఈ చర్చా వేదికలో గత 26 సం.లుగా సభ్యులుగా ఉన్న గుండు అప్పలరాజు, వి ఎస్ ఎన్ మూర్తి, నక్కాని అప్పారావు, పలువురు మాజీ పోలీసు అధికారులు, న్యాయవాదులు, మహిళలు, విద్యార్దులు పాల్గొన్నారు.