ఛలో పిఠాపురం జనసేన12వ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ

 

*ఛలో పిఠాపురం జనసేన12వ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ*






*అన్నమయ్య జిల్లా టి. సుండుపల్లి మండల కేంద్రంలో జనసేన,కూటమి నేతలు జనశైనికులతో కలిసి ఛలో పిఠాపురం అనే పోస్టర్లు చేతపట్టుకుని నినాదాలు చేస్తూ.. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు. మార్చి14వ తేదీన12వ జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో కలిసి పోరాటాలు చేశాం. *పిఠాపురం* చిత్రాడలో కలిసి ఉత్సవం జరుపుకుందామంటూ పిలుపునిచ్చారు. తదనంతరం  జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారు ఎమ్మెల్యే కోటాలో జనసేన తరపున ఎమ్మెల్సీ గా నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా అభినందనలు తెలియజేశారు.అదేవిధంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం భాగస్వామ్యంలో భాగంగా గౌరవనియులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చొరవతో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవనియులైన ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సారధ్యంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గంలో కూడా భాద్యతలు స్వీకరిస్తారన్నారు. అలానే ఇటీవల పులివెందుల ఎమ్మెల్యే మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని సామాజిక మాధ్యమాల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి మీడియా వారు అడిగిన ప్రశ్నలకు ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ కు ఎక్కువ ఎమ్మెల్యే కు తక్కువ అని వ్యాఖ్యానించారంటూ..

ఆ విషయంపై రామ శ్రీనివాస్ స్పందిస్తూ గతంలో ప్రజలు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోలేకపొగా అధికార దాహానికి దాసోహమై ఎమ్ మాట్లాడాలనో తేలిక మతి స్థిమితం లేని మాటలతో పవన్ కళ్యాణ్ గారిని ఏ ఒక్కరు కూడా తక్కువ చెయ్యలేరని హెచ్చరిస్తూ ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి జగనంటే విధ్వంసం!పవనంటే అభివృద్ధి అంటూ బదులిచ్చారు.ఈ కార్యక్రమంలో జనసేన, కూటమి శ్రేణులు,మాజీ ఎంపీటీసీ నంద్యాల రామయ్య, మండల బలిజసంగం ప్రధాన కార్యదర్శి సి రామంజులు, నీటిసంగం అధ్యక్షులు టి. ఆనంద్ రెడ్డి, సుబ్బరాజు, మహ్మద్ రఫీక్, ఛాన్ భాష, ధనుంజయ, నాగేంద్ర, హరికృష్ణ,రవీంద్ర, సురేష్ తదితర జనశైనికులు పాల్గొన్నారు.