టిడిపి బలోపేతానికి మాజీ కార్పొరేటర్ వీరంకి డాంగే కుమార్ ఎనలేని కృషి
ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ వీరంకి 10వ వర్థంతి కార్యక్రమం
విజయవాడ : బిసి నాయకుడు, మాజీ కార్పొరేటర్ వీరంకి డాంగే కుమార్ 10వ వర్ధంతి కార్యక్రమం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం జరిగింది. ముందుగా వీరంకి డాంగే కుమార్ చిత్రపటానికి టిడిపి నాయకులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన వీరంకి డాంగే కుమార్ మూడు సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి కార్పొరేటర్ గా గెలిచి పార్టీ బలోపేతం చేయటంతో పాటు, డివిజన్ ప్రజలకు నిత్యం అందుబాటులో వుంటూ వారి సమస్య పరిష్కారం కృషి చేసేవాడని కొనియాడారు.ప్రతి క్షణం డివిజన్ అభివృద్ది కోసం , పార్టీ కార్యకర్తల అండగా వుండే డాంగే వంటి నాయకుడు లేకపోవడం పార్టీకి, డివిజన్లోని కార్యకర్తలకు తీరం లోటు అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బిసి గౌడ సాధికారత కన్వీనర్ పామర్తి కిషోర్ బాబు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీ, కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు పెటేటి రామ్మోహన్, టిడిపి రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం, టిడిపి నాయకులు మాగంటి నరసింహా చౌదరి, డాక్టర్ సంకె విశ్వనాథం, అబీద్ హుస్సెన్, మాజీ కార్పొరేటర్ కాకు మల్లిఖార్జునయాదవ్, యు.వి. శివాజీ, బిసి నాయకులు పట్నాల హరిబాబు లతో పాటు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.