దంత వైద్యశాలను ప్రారంభించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు

 దంత వైద్యశాలను ప్రారంభించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు.

ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 07.02.2025.









మైలవరం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన కృష్ణ మల్టీస్పెషాలిటీ దంత వైద్యశాలను గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు మల్టీ స్పెషాలిటీ వైద్యశాల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. సామాన్య ప్రజలకు అందుబాటులో విధంగా సేవా దృక్పథంతో మెరుగైన వైద్యం అందించాలని వారికి సూచించారు. శ్రీ ద్వారకా తిరుమల దేవస్థానం ధర్మకర్తల పాలకమండలి సభ్యులు రాజా ఎస్.వి నివృతరావు గారు, ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.