విజయవాడ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో తొవ్వినకొద్దీ ఆర్థిక మూలాలు మహిళలతో ఆర్థిక సంబంధాలు బయటపడుతున్నాయి.
ఒక ఎయిర్ హోస్టెస్ గా తక్కువ జీతంతో అతి తక్కువ కాలంలోనే ఒక వివాహిత మహిళ కొట్లాది రూపాయలకు ఆస్తిపరురాలుగా మారటం ప్రస్తుతం వంశీ కేసులో కీలకంగా మారింది.అక్రమ సొమ్ముతో వాహనాలు, విలాసం, భవనాలలో రాజభోగం అనుభవిస్తున్న వివాహిత ఎయిర్ హోస్టెస్,
*ఇంతకీ ఎవరా వివాహిత ఎయిర్ హోస్టెస్?*
హనుమాన్ జంక్షన్ లో కోట్లకు పడగలెత్తిన ఆ మహిళ ఎవరు? ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ కేసులో ఒక వివాహిత ఎయిర్ హోస్టెస్ తో ఉన్న ఆర్థిక లావాదేవీలు కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు, పోలీసు దర్యాప్తులో కీలకంగా మారాయి.
మాజీ ఎమ్మెల్యే వంశీ ప్రధాన అనుచరుడు రంగా కోసం పోలీసుల గాలింపు లో భాగంగా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ద్వారా పోలీసులు కీలకమైన సమాచారం సేకరించారు
వాట్సాప్ మరియు చాటింగ్ ఆధారంగా పలువురు వివాహిత మహిళతో ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.
సర్క్యూట్ చాటింగ్ ద్వారా బట్టబయలైన సమాచారంతో, మహిళల పేర్లను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.
ఆ మహిళా సొంత గ్రామం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి, గన్నవరం మండలానికి చెందిన ఒక వ్యక్తిని వివాహం చేసుకొని ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నట్లుగా కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు.
వివాహిత మహిళ ప్రస్తుతం ఎయిర్ హోస్టెస్ గా పని చేస్తున్నట్టు సమాచారం.
సర్క్యూట్ చాటింగ్ ద్వారా, వల్లభనేని వంశీకి, రంగా కి, మహిళకి మధ్యన కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.
ఇటీవల కాలంలోనే పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో 15 ఎకరాలు విలువైన భూములను కొనుగోలు చేసినట్లుగా, ఏలూరులో మూడు ఎకరాల స్థలంలో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మాణం చేసినట్లు, కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు సాగిస్తున్నారు.
హైదరాబాదులో ఖరీదైన అపార్ట్మెంట్ ఖరీదైన విల్లా ఖరీదైన రెండు కార్లు ఉన్నట్లుగా ఆధారాలు సేకరించిన పోలీసులు. ఇటీవల కాలంలో ఆ ఎయిర్ హోస్టెస్ ద్వారా ఒక చార్టెడ్ ఫ్లైట్ కొనేందుకు కూడా బేరసారాలు సాగించినట్లు పోలీస్ దర్యాప్తులో వెల్లడైంది.
మరొక మహిళది హనుమాన్ జంక్షన్ గా గుర్తించారు, బోటిక్ పని నిర్వహించుకుంటుందని బస్టాండ్ సమీపంలో ఉంటుందని పోలీసులు గుర్తించారు.
ఇదే కాకుండా మల్లవల్లి లోని భారీగా జరిగిన 175 ఎకరాల మట్టి కుంభకోణంలో, అంపాపురానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు తమ్ముడు తో కలిసి వంశీ భారీ కుంభకోణానికి పాల్పడినట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించారు.
ఒరిస్సాలో 300ఎకరాల భూమిని కూడా కొనుగోలు చేసినట్లుగా పోలీసులకు ఆధారాలు లభ్యమయ్యాయి.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి, వ్యవహారాల్లో అత్యంత కీలకంగా వ్యవహరించే రంగా అతనికి అనుగుణంగా ఉన్న బాపులపాడు మండలం బొమ్ములూరు గ్రామని చెందిన ఎర్రంశెట్టి రామాంజనేయులు అలియాస్ పొట్టి రాము వల్లభనేని వంశీ, రంగాకి అనుచరుడిని అని చెప్పి చేసిన అక్రమాలు చాలా ఉన్నాయి పేరు ప్రసిద్ధ కలిగిన పెద్ద కుటుంబలకి సంబంధించిన మహిళలకు వల వేసి వారిని వ్యభిచార ఉచ్చులో దింపి వారిని లోబర్చుకుని వారిని వంశీ, రంగా, శేషు తదితరులకు పరిచయం చేసి వారికి అత్యంత సన్నిహితం అయినాడని వివరాలు వెల్లువడుతున్నాయి, అంతే కాకుండా పొట్టి రాము చేతిలో మోసపోయిన అమ్మయిల సంఖ్య చాల ఎక్కువగా ఉంది 2014 రాజకీయాల్లోకి కొత్తగా వచ్చి తర్వాత రంగాకి అనుగుణమై ఉంటూ అక్రమా మైనింగ్, అమ్మాయిలతో వ్యభిచారం హనుమాన్ జంక్షన్ షో ఆఫ్ రాజకీయం సెటిల్మెట్, దందాలు కొంత మంది కుర్రోళ్ళుని అడ్డం పెట్టుకుని గంజాయి వ్యాపారం, చేయించి వాళ్లకు మందు, డబ్బు అలవాటు చేసి కిన్ను అనే అతను ద్వారా అమ్మాయిల మరియు వ్యక్తిగత లావాదేవీలు, గొడవలు చేయించటానికి అతడిని పెట్టుకుని నూజివీడు రోడ్డులో ఒక స్థలాన్ని ఆక్రమించి దానిలో ఒక కాంప్లెక్స్ అక్రమంగా
కట్టారు, మండల కార్యాలయం వెనకా అక్రమ లేఅవుట్ విజయ డైరీలో వంశీ అండదండలతో కాంట్రాక్టర్ కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టారు.
విజయవాడ రోడ్డులో YCP ఆఫీసులో హోటల్, పోలీస్ స్టేషన్ ప్రక్కన ప్రముఖ అపార్ట్మెంట్ నందలి ఇద్దరి మహిళలతో బోటిక్, ఇతర వ్యాపారాలు అక్రమ వ్యవహారాలకు అదే అడ్డాగా మార్చుకుని కొంత మంది యువతకి ఉపాధి కల్పించుట అని అమ్మాయిలను లోబర్చుకోవటం చాల మందిని అక్కడికి రప్పించడం తరహాలో అక్రమాలు బయట పడుతున్న నేపథ్యంలో డ్రైవర్ వంశీ సహయంతో సత్యవర్థన్ ను ఇక్కడికి తీసుకు వచ్చినట్టు తేలింది. ఇంకా లోతైన వివరాలు రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు.
వంశీ ఫోన్ దొరికితే వంశీ, రంగా, రామాంజనేయులు లావాదేవీలు బహిరంగమవుతాయని పోలీసులు భావిస్తున్నారు.