కృష్ణా జిల్లా
పెనమలూరు నియోజకవర్గం
వైద్యం వికటించి,
కాలు చేయి పడిపోయిన పరిస్థితి
ఉయ్యూరులో హోప్ హాస్పిటల్ లో చోటు చేసుకున్న ఘటన
పమిడిముక్కల గ్రామానికి చెందిన గోవులపల్లి వెంకటేశ్వరరావు 45 సంవత్సరాలు కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
వారం రోజుల క్రితం స్కూటీపై వెళుతూ ప్రమాదవశాత్తు స్కిడ్ అయ్యి పడిపోగా అతన్ని ఉయ్యూరు హోప్ హాస్పిటల్ లో కుటుంబ సభ్యులు అడ్మిట్ చేయడం జరిగింది.
డాక్టర్ జి జ్యోతి వైద్యం లో నిర్లక్ష్యం చూపడమే కాకుండా, పేషెంట్ ని సకాలంలో మెరుగైన వైద్యం కొరకు,
న్యూరాలజిస్ట్ కి రిఫర్ చేయకపోగా, డాక్టర్ జ్యోతి వైద్యం చేస్తూ ఉండగా జి వెంకటేశ్వరరావుకి కాలు చేయి పడిపోయిన దారుణ సంఘటన చోటు చేసుకుంది.
ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు డాక్టర్ను సంప్రదించగా,
నిర్లక్ష్య ధోరణిలో బాధితులపై మాట్లాడుతూ మీకు చేతనైంది చేసుకోండి పోయి అని దురుసుగా ప్రవర్తించిన యాజమాన్యం
హాస్పటల్ యాజమాన్యం తీరుకు కుటుంబ సభ్యులు హాస్పిటల్ ముందు బైఠాయించారు.