లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎంఈఓ
చిలకలూరిపేటటౌన్, ఫిబ్రవరి10, న్యూస్9 మండలంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు చల్లా
వెంకట శ్రీనివాసరావు పిర్యాదు మేరకు ఎసిబి అధికారులు సోమవారం చిలకలూరిపేట యంఈఓ కె లక్ష్మీ బాయిని అమె ఇంటివద్ద మద్యవర్తిద్వారా లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. చల్లా వెంకట శ్రీనివాసరావు పిఎఫ్కు సంబందించిన ఫైల్ను ట్రెజరీకి పంపటానికి రూ30వేలు లంచం డిమాండ్ చేశారు. మద్యవర్తి మాజేటి వెంకట శ్రీనివాసరావు చేత ఆ డబ్బును పంపమని యంఈఓ కోరడంతో ఆ డబ్బును సోమవారం శ్రీనివాసరావు తీసుకువెళ్లి యంఈఓకి ఇచ్చే సమయంలో ఎసిబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసుకున్నారు.