ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. స‌హకారంతో కేశినేని ఫౌండేష‌న్ ద్వారా సొంత నిధుల‌తో శిక్ష‌ణ ఇప్పించేందుకు ఏర్పాటు

వికసిత్ పంచాయత్ లక్ష్యంగా గ్రామాభివృద్దికి ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ముందడుగు

*ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్.  స‌హకారంతో కేశినేని ఫౌండేష‌న్ ద్వారా సొంత నిధుల‌తో శిక్ష‌ణ ఇప్పించేందుకు ఏర్పాటు 









*పార్ల‌మెంట్ ప‌రిధిలో 100 మంది యువతీయువ‌కులు ఎంపిక‌

*తొలి విడ‌త‌గా 33 మంది యువ‌కులకి హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్. సంస్థ‌లో శిక్ష‌ణ‌

*ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ లో డిసెంబర్ 10 నుంచి 16 వ‌ర‌కు వారం రోజులు పాటు శిక్ష‌ణ కార్య‌క్ర‌మం

*జెండా ఊపి బ‌స్సును ప్రారంభించిన గొట్టుముక్కుల‌, డూండీ, మాజీ మేయ‌ర్ కోనేరు 


విజ‌య‌వాడ :  త‌న పార్లమెంట్ పరిధిలోని 294 గ్రామాలను అభివృద్ది చేయ‌ట‌మే కాకుండా , దేశంలోనే మోడ‌ల్ గ్రామాలుగా తీర్చిదిద్దాల‌నే ల‌క్ష్యంతో పాటు, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆశ‌య సాధ‌న‌లో భాగంగా  ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ ప్రెన్యూర్ వుండే విధంగా ఎంపి కేశినేని శివనాథ్  కృషి చేస్తున్నారు.


త‌న పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని 294 గ్రామాల‌ను  అన్ని రకాలుగా అభివృద్ధి చేయటానికి ఉపాధి కల్పన,మహిళా సాధికారత‌, గ్రామీణ విద్య, ఆరోగ్యంపై దృష్టి,  గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (GPDP) రూపొందించడం,   వ్య‌వ‌సాయం, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల నిర్వహణ, స్వచ్ఛ గ్రామ – హరిత గ్రామ అభివృద్ధి, డిజిటల్ సేవల ద్వారా పంచాయతీ పరిపాలన,  ఫ్రెండ్లీ విమెన్ , గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ అనేక రకాలుగా గ్రామాలను ప‌రిపూర్ణం అభివృద్ది చేయ‌టం కోసం ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) జాతీయ గ్రామీణాభివృద్ది సంస్థ మరియు పంచాయితీరాజ్ సంస్థల సహకారంతో ముంద‌డుగు వేశారు.


 వికసిత్ పంచాయిత్ లో భాగంగా విజ‌య‌వాడ పార్లమెంట్ పరిధిలో 294 గ్రామాల‌ను ఎన్.ఐ.ఆర్.డి స‌హ‌కారంతో అభివృద్ది చేసేందుకు  100 మంది యువతీ యువ‌కులకు స్వ‌యం ఉపాధి రంగంలో శిక్ష‌ణ ఇప్పించేందుకు ఎంపిక చేశారు.   వీరిలో తొలివిడ‌త‌గా తిరువూరు నియోజ‌కవ‌ర్గం ఎ.కొండూరు మండ‌ల నుంచి తొమ్మిది మంది, మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం జి.కొండూరు నుంచి ఎనిమిది మంది, జ‌గ్గ‌య్య‌పేట నియోజ‌క‌వ‌ర్గం జ‌గ్గ‌య్య‌పేట రూర‌ల్ మండ‌లం నుంచి 8 మంది, నందిగామ నియోజ‌క‌వ‌ర్గం వీరుల‌పాడు మండ‌లం నుంచి 8 మంది మొత్తం 33 మంది యువ‌కుల‌ను  హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ లో  డిసెంబర్ 10 నుంచి 16 వ‌ర‌కు వారం రోజులు పాటు జ‌ర‌గ‌బోయే శిక్ష‌ణ కార్య‌క్ర‌మంకు ఆదివారం బ‌స్సులో పంపించారు.


గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ నుంచి  హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్  కి ఆదివారం మ‌ధ్యాహ్నం బ‌స్సు బ‌యలుదేరింది. ఈ బ‌స్సును ఏపీ బిల్డింగ్‌ అదర్‌ కనస్ట్రక్షన్‌ వర్కర్స్‌ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్క‌ల ర‌ఘురామ‌రాజు, ఆర్య‌వైశ్య డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ డూండీ రాకేష్‌, మాజీ మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్ జెండా ఊపి బ‌స్సు ప్రారంభించారు. 


ఈ సంద‌ర్భంగా  విజ‌య‌వాడ మాజీ మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్, ఏపీ బిల్డింగ్‌ అదర్‌ కనస్ట్రక్షన్‌ వర్కర్స్‌ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్క‌ల ర‌ఘురామ‌రాజు, ఆర్య‌వైశ్య కార్పొరేష‌న్ డూండీ రాకేష్‌,   మాట్లాడుతూ హైద‌రాబాద్ లోని ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ లో న‌వంబ‌ర్ 1, 2024న‌ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) స్వ‌యం ఉపాధి అవ‌కాశాల‌పై ఒక రోజు శిక్ష‌ణ తీసుకున్నార‌ని,  ఎన్.ఐ.ఆర్.డి స‌హ‌కారంతో దేశంలోనే మోడ‌ల్ గ్రామాలుగా చేయాల‌నే ల‌క్ష్యంతో ప‌నిచేస్తున్నార‌న్నారు. 


స్వ‌యం ఉపాధి అవ‌కాశాల‌పై శిక్ష‌ణకి వెళ్లే యువ‌తీయువ‌కుల‌కి త‌న సొంత నిధుల‌తో కేశినేని ఫౌండేష‌న్ ద్వారా నెల‌కి ప‌ది వేల రూపాయ‌ల ఉప‌కార వేత‌నం అందించ‌టంతో పాటు, ఈ వారం రోజుల శిక్ష‌ణ‌కు సంబంధించి అయ్యే ఖ‌ర్చు  రూ.15 ల‌క్ష‌ల రూపాయ‌లు  ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఎన్.ఐ.ఆర్.డికి చెల్లించారని తెలిపారు.


వారం రోజుల పాటు శిక్ష‌ణ పొందిన వ‌చ్చిన వారు రాబోయే కాలంలో వారి మండ‌లాల్లోని గ్రామాల అభివృద్ది కి కృషిచేస్తార‌ని చెప్పారు. శిక్ష‌ణ పొందిన వారు గ్రామాల‌కు తిరిగి వ‌చ్చిన త‌ర్వాత వారి గ్రామాభివృద్దికి అవ‌స‌రమైన వాటిని గుర్తించి ఎంపి కేశినేని శివ‌నాథ్ కి అంద‌జేస్తే ఆ గ్రామాల‌కు వాటిని ఎంపి కేశినేని శివ‌నాథ్ అంద‌జేస్తార‌ని తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ ప్రెన్యూర్ వుండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలను ఎన్టీఆర్ జిల్లాలో సాకారం చేసేందుకు ఎంపి కేశినేని శివ‌నాథ్ అకుంఠిత దీక్షతో  పని చేస్తున్నార‌న్నారు. 


ఇందుకోసం జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ , ఇత‌ర జిల్లా అధికారులు, యువ‌త యువ‌కులు, జిల్లా డ్వాక్రా సంఘ సమైక్య అధ్యక్షులు అన్ని మండలాల డ్వాక్రా సంఘాల సమైక్య అధ్యక్షులతో ఎంపి కేశినేని శివ‌నాథ్ స‌మావేశాలు నిర్వ‌హించటంతోపాటు, ఇప్ప‌టికే 64 మంది స్వయం సహాయక సంఘాల సమైక్య అధ్యక్షురాలకు స్వయం ఉపాధి రంగం పై అవగాహన కల్పించేందుకు హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డి పంపించ‌టం జ‌రిగింద‌న్నారు. ఎన్.ఐ.ఆర్.డిలో వున్న‌ 70 ర‌కాల స్వ‌యం ఉపాధి అంశాల‌పై అవగాహ‌న పెంచుకున్నార‌ని తెలిపారు. త‌న పార్ల‌మెంట్ ప‌రిధిలోని అన్ని గ్రామాలు ఒకేసారి అభివృద్ది చెందే విధంగా ప్ర‌తి మండ‌లంలో క్ల‌స్ట‌ర్స్ ఏర్పాటు చేసి వాటిని కేంద్ర ప్ర‌భుత్వం ప‌థ‌కాలు, ఎన్.ఐ.ఆర్.డి స‌హ‌కారంతో అభివృద్ది చేయటానికి కృషి చేస్తున్నార‌ని తెలిపారు. గ్రామాభివృద్ది కోసం కృషి చేస్తున్న ఎంపి కేశినేని శివ‌నాథ్ కి అభినంద‌న‌లు తెలిపారు. 


ఈ కార్య‌క్ర‌మంలో కార్పొరేట‌ర్  చెన్నుపాటి ఉషారాణి ,  మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణ ,  ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ సొంగా సంజయ్ వర్మ. ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఎస్ కే కరీముల్లా, ఎన్టీఆర్ జిల్లా టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి సాయి చరణ్. టిఎన్టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుచూరి ప్రసాద్ , ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ జీవీ నరసింహారావు ల‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు....