విద్యుత్తు ఉత్పాదన గురించి విద్యార్థులకు క్లాస్ తీసుకున్న శాసనసభ్యులు కృష్ణప్రసాదు

 *ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం*

విద్యుత్తు ఉత్పాదన గురించి విద్యార్థులకు క్లాస్ తీసుకున్న శాసనసభ్యులు కృష్ణప్రసాదు.

ఇబ్రహీంపట్నం సెయింట్ జేవియర్ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన శాసనసభ్యులు కృష్ణప్రసాద్.




విద్యుత్తు ఉత్పాదనలోని రకాల గురించి గౌరవ మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు విద్యార్థులకు క్లాస్ తీసుకున్నారు.ఇబ్రహీంపట్నంలోని సెయింట్ జేవియర్ పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ ను శాసనసభ్యులు కృష్ణప్రసాదు ప్రారంభించారు.


ఈ సందర్భంగా జలవిద్యుత్ ప్లాంట్లు, అణు విద్యుత్ ప్లాంట్లు, బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు, చమురు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు, సహజ వాయువు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు, సౌర విద్యుత్ ప్లాంట్లు, పవన శక్తి విద్యుత్ ప్లాంట్ల ద్వారా విద్యుత్తు ఉత్పాదన జరుగుతుందని విద్యార్థులకు వివరించారు. ఇంటిపై ఏర్పాటు చేసుకునే సోలార్ యూనిట్లకు సూర్య ఘర్ యోజన పథకం ద్వారా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

విద్యార్థిని, విద్యార్థులు తమదైన శైలిలో అనేక పరికరాలు తయారు చేసి ఈ సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ లో ఉంచారు. వారి ప్రయోగాలను శాసనసభ్యులు కృష్ణప్రసాదు వీక్షించారు. చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించారు. విద్యార్థులలోని ప్రతిభా పాఠవాలు, సృజనాత్మకత ఇలాంటి ప్రదర్శనల ద్వారా మరింత వెలుగులోకి వస్తాయని శాసనసభ్యులు కృష్ణప్రసాదు పేర్కొన్నారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.


సెయింట్ జేవియర్ వ్యవస్థాపకులు టి.అర్జనరావు మాట్లాడుతూ యాభై సంవత్సరాల క్రితం తాను విద్యా సంస్థలను ప్రారంభించామని ఎంతో మంది విద్యార్థులు తమ పాఠశాలలో విద్యనభ్యసించి వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని,అదే విధంగా ప్రతిఒక్క విద్యార్థికి విలువలతో కూడిన విద్యను అందించడమే తమ లక్ష్యమని అన్నారు.నేడు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ సుమారు మూడు వందల మంది వివిధ రకాల ప్రాజెక్టు లు ప్రదర్శించడం సంతోషంగా ఉందని తెలిపారు.


ఈ కార్యక్రమం లో కరెస్పాండెట్ ప్రవీణ, ప్రిన్సిపాల్ వాణి కుమారి, కొండపల్లి మునిసిపాలిటీ చైర్మన్ అభ్యర్థి చెన్నుబోయిన చిట్టిబాబు, నారాయణ ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.