పీతా వారి పెళ్లిసందడిలో శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు.
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 06.02.2025.
ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామంలో పీతా వారి పెళ్లి సందడి వేడుకల్లో మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పాల్గొన్నారు. పీతా అప్పారావు గారు, శ్రీమతి రత్నకుమారి గార్ల దంపతుల కుమారుడు రాఘవరాజు గారు, స్వాతి గార్ల వివాహ వేడుకలు గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకలలో పాల్గొన్న శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.