నాన్నను.. కసిగా చంపేశాడు

నాన్నను.. కసిగా చంపేశాడు 





ఆ తండ్రి నడకలు రాని తన బిడ్డను నెత్తిన ఎక్కించుకుని ఊరేగాడు. బుడిబుడి తప్పటడుగుల కొడుకు కాలుజారి పడిపోతాడని భయపడి.. బిడ్డ చిటిక వేలు పట్టుకుని నడక నేర్పించాడు. జులాయిగా.. పోకిరిగా మారినా... పున్నామ నరకాన్ని తప్పించటానికి తలకొరివి పెడతాడని ఆశించాడు. కానీ ఆ కిరాతక బిడ్డ తన తండ్రిని రంపంతో కోసి ప్రాణం తీసి నేరుగా నరకానికి పంపాడు. సభ్య సమాజం తల్లడిల్లే ఈ దారుణం ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఇండ్లచెరువు గ్రామం ఎస్సీ కాలనీ లో  ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఆ ఊరి జనాన్ని కలచి వేసింది. అంతే హంతకుడిని పట్టుకుని స్థంభానికి కట్టేసి పోలీసులకు అప్పగించారు. ఈ గ్రామానికి చెందిన పైడిపోగు యేసయ్యను తనయుడు మరియదాసు దారుణంగా చంపేశాడు. ఈ అమానవీయ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.