*కోడిపేగులు వ్యర్ధాల నాలుగు వాహనాలను సీజ్ చేసిన నందివాడ ఎస్.ఐ కె. శ్రీనివాస్*
కోడిపేగులు,గొడ్డుమాసం,పాడైపోయిన అన్నం ఇవి నందివాడ మండలంలో ఫంగస్ చెరువులకు సాగు కొరకు వినియోగించే ఎంతో ప్రమాదకరమైన వ్యర్ధపదార్ధాలు ఈ చేపలను మనం తింటే ఏమవుతుంది._
_వ్యర్థ పదార్థాలను సైతం వృధాగా కానివ్వకుండా చేపలకు మేతగా వేస్తున్నారు._
_ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు._
_ఏలూరు జిల్లాలో ఇటీవలే పట్టుబడడంతో నందివాడ మండలాన్ని వాహన మార్గం దిశగా మార్చుకొని అడ్డగోలుగా వేస్ట్ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నారు._
_నందివాడ ఎస్.ఐ కె. శ్రీనివాస్ సిబ్బంధి కోళ్ల వ్యర్ధాల వాహనాలపై నిఘా పెట్టగా సోమవారం ఉదయం సమయంలో కుదరవల్లి గ్రామశివారుల్లో నాలుగు ఐసర్ వాహనాలు వ్యర్ధాలు సుమారు 40 టన్నులు తరలిస్తుండగా సిబ్బందితో కలిసి వాహనాలను అదుపులోకి తీసుకున్నారు._
_అనంతరం సమాచారం సంబంధిత నందివాడ తహసీల్దారి గురుమూర్తి రెడ్డి,స్థానిక వీఆర్వో కి,అందించి వారి సమక్షంలో పట్టుబడిన వ్యర్ధాల వాహనాలను నాశనం చేయడం, వాహన డ్రైవర్ లైసెన్సులను రద్దు చేయడం జరిగిందని వ్యర్ధాలతో సాగు చేస్తున్న ఫంగస్ చేపల చెరువులను గుర్తించి తగు చర్యలు తీసుకుంటామని నందివాడ తాసిల్దార్ గురుమూర్తి రెడ్డి, మరియు నందివాడ మండలం ఎస్.ఐ కె.శ్రీనివాస్ పేర్కొన్నారు._