.....నా బిడ్డను కాపాడండి.....
సీఎం సారు
......పలు హాస్పిటలకు తిప్పిన మెరుగు పడని తన బిడ్డ ఆరోగ్యం.... ప్రభుత్వం దాతలు ఆదుకోవాలని...
టి సుండుపల్లి ఫిబ్రవరి 26
9న్యూస్
అన్నమయ్య జిల్లా సుండుపల్లి:- అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తె జ్యోతికి మెరుగైన వైద్యం అందించి కాపాడాలని కొప్పు సుజాత ప్రభుత్వం వారిని బుధవారం ఒక ప్రకటన ద్వారా వేడుకున్నారు. వివరాల్లో వెళ్తే.. సుండుపల్లె మండల పరిధిలోని దిగువ గుల్లవాండ్లపల్లి కు చెందిన కొప్పు జ్యోతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నది గత నాలుగు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. కొప్పు సుజాత కు ముగ్గురు పిల్లలు కలరు. తల్లి కూలి పని చేసుకుంటూ ముగ్గురు పిల్లలను చదివించుకుంటూ జీవనం సాగించేది. ఇటీవలే తనకు అనారోగ్య రీత్యా సమస్యలు రావడంతో కూలి పనికి వెళ్లడం కూడా మానేసింది. తన బంధువుల దగ్గర నుంచి ఆరు లక్షల రూపాయలు అప్పు తీసుకొని ఏలూరు బెంగళూరు మొదలగు హాస్పిటల్లో చూపించగా డాక్టర్లు మాట్లాడుతూ PNH పరోసిక్స్మల్ నాక్టర్నల్ హిమోగ్లోబిన్ వీక్నెస్ తలనొప్పి బ్రీతింగ్ ప్రాబ్లం రక్తం గడ్డ కట్టడం బ్యాక్ పెయిన్ వీర్యంలో రక్తస్రావం జరగడం హార్ట్ బీట్ పెరగడం వైరల్ ఇన్ఫెక్షన్ కళ్ళు పచ్చబడటం రక్తనాళాలు చిట్లడం అధిక జ్వరం రావడం ఎముకలలో ఇన్ఫెక్షన్ దీని యొక్క లక్షణాలు అని డాక్టర్లు తెలిపారు.తన బిడ్డ ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో తల్లి కొప్పు సుజాత తన బిడ్డను బ్రతికించండి సీఎం సారు అంటూ కన్నీటి పర్యంతమయ్యారు . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , ఐటీ శాఖ మంత్రి లోకేష్ ను తమ బిడ్డకు ప్రాణ బిక్ష పెట్టాలని ఆమె ప్రాధేయ పడ్డారు.