మంత్రి నారా లోకేష్ కి స్వాగతం పలికిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
ఢిల్లీ : రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ లోని రైల్వే ప్రాజెక్టులకు రూ.9,417 కోట్లు కేటాయించినందుకు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, రైల్వే, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో సమావేశమై ధన్యవాదాలు తెలిపేందుకు ఢిల్లీ విచ్చేసిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ కి మంగళవారం విమానాశ్రయంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) స్వాగతం పలికారు.
మంత్రి నారా లోకేష్ కి ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), ఎంపి పుట్టా మహేష్ కుమార్, ఎంపి గంటి హరీష్ మధుర్, రాజ్యసభ ఎంపి సానా సతీష్ లతో కలిసి పుష్పగుచ్ఛం అందించారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి మంత్రి నారా లోకేష్ ఢిల్లీ చేరుకున్నారు.