కృష్ణాజిల్లా,
*కృష్ణాజిల్లా, గన్నవరం సబ్ డివిజన్, కంకిపాడు సర్కిల్, కంకిపాడు పోలీస్ స్టేషన్*
*హైవేపై వెళ్లే వారిని బెదిరించి డబ్బులు దొంగలించే నేరస్థులను పట్టుకున్న కృష్ణాజిల్లా కంకిపాడు పోలీసులు*
నిందితులు వద్ద నుండి 10,000 రూపాయల నగదు మరియు సుమారు 6,50,000 విలువైన 5 మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్నారు..
వివరాల్లోకి వెళితే ఈనెల 18వ తారీఖున పొద్దుటూరు గ్రామానికి చెందిన వ్యక్తి కంకిపాడు నుండి ప్రొద్దుటూరు తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో బండిపై వెళుతుండగా శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ వద్దకు వచ్చేసరికి వెనక నుండి ఐదుగురు వ్యక్తులు రెండు బైకులు పై వచ్చి ఇతనిని,ఆపి బెదిరించి ఇతని వద్ద ఉన్న పదివేల రూపాయల నగదును దొంగలించారని ఫిర్యాదు ఇచ్చారు..
ఈ ఫిర్యాదు పై కంకిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడమైనది..
ఇటువంటి కేసు మళ్లీ జరగకుండా ఉండడానికి కంకిపాడు ఎస్ఐ సందీప్ గారు పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి ఒక టీం గా ఏర్పడి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అంశాలను ఆధారంగా చేసుకోవడం జరిగింది..
ఈరోజు అనగా 24 వ తారీకు రాబడిన సమాచారం మేరకు ఉదయం 9 గంటలకు కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామ మసీదు పక్క సందు ఎంట్రన్స్ వద్ద రెండు బైక్ లపై ఉన్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది..
నిందితులను విచారించగా వీళ్ళు విలాసాలకు అలవాటు పడి సులభ సంపాదన మోజులో దొంగతనాలు చేయాలనే ఉద్దేశంతో ఈ దారిని ఎంచుకున్నట్లు సమాచారం..
నిందితులు గన్నవరం, ఆత్కూరు పెనమలూరు,కంకిపాడులో మొత్తం ఐదు బైకులు దొంగిలించినట్లుగా సమాచారం..
*_ఈ కేసును చేదించడానికి డిపార్ట్మెంట్ లో అత్యధిక ప్రతిభ కనపరచిన వారు..ఎస్సై సందీప్, హెచ్ సి కె చంద్రబాబు, పి సి పి ఎస్ ఎన్ మూర్తి,పిసి ఎస్టీ బాజీ బాబు*_