ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి మీడియా సమావేశం.

 *ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి మీడియా సమావేశం.* 

 *ఏపీ ఫైబర్ నెట్ కు 78 వేల కి.మీ. ఆప్టికల్ కేబుల్ ఉంది..ఫైబర్ నెట్ కు ప్రతీ రోజు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.* 



 *దినేష్ కుమార్ ఐఏఎస్ ఆగస్టులో చార్జ్ తీసుకున్నారు..చార్జ్ తీసుకున్న తర్వాత ఒక్క రోజు కూడా ఫైబర్ నెట్ పై ఫోకస్ చేయలేదు.* 


 *గత అధికారులతో కుమ్మక్కు అయ్యారా అన్న సందేహం వస్తోంది.. మా ప్రభుత్వం వచ్చాక ఫైబర్ నెట్ కు ఒక్క రూపాయి రాలేదు.* 


 *ఒక్క కొత్త కనెక్షన్ ఇవ్వలేదు.. ముగ్గురు అధికారులకు నోటీస్ పిరియడ్ ఇవ్వాలి..సత్యరామ భరద్వాజ(చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్), సురేష్( బిజినెస్ హెడ్), శశాంక్ హైదర్ ఖాన్(ప్రొక్యూర్ మెంట్ ఆఫీసర్)  ముగ్గురు అధికారుల సేవలు ఫైబర్ నెట్ కు అవసరం లేదు.* 


 *గతంలో తొలగించిన వారిని ఇంత వరకు విధుల నుంచి టెర్మినేట్ చేయలేదు..కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆదేశాలు అమలు చేయడానికి అధికారులకు ఉన్న అభ్యంతరం ఏంటి?* 


 *ఫైబర్ నెట్ లో జీఎస్టీ సమస్య వచ్చింది..గత నెలలో మాకు రూ.377 కోట్ల జరిమానా విధించారు.* 


 *ఫైబర్ నెట్ సంస్థ ఇప్పటికే కష్టాల్లో ఉంది : ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి*